రైతు లేనిదే రాజకీయం లేదు

రైతు లేనిదే రాజకీయం లేదు

ప్రతి గ్రామ పంచాయతీకి కిసాన్ మోర్చా కమిటీలు – చిగురుపాటి కుమార్ స్వామి

గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : రైతు లేనిదే రాజకీయమే ఉండదని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమార్ స్వామి స్పష్టం చేశారు. గుంటూరులోని బిజెపి జిల్లా కార్యాలయంలో సోమవారం జోనల్ సమావేశాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుమార్ స్వామి మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీలో కిసాన్ మోర్చా కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. మండల, జిల్లా స్థాయిల్లో బలమైన కమిటీలు ఏర్పడితేనే రైతుల సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. రైతుల కోసం పనిచేయడం తన భాగ్యమని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే రైతు నాయకులను భవిష్యత్‌లో జిల్లా, రాష్ట్ర కమిటీల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.

జిల్లా బిజెపి అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడుతూ... రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సమర్థుడైన నాయకుడని, ఆయన ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా మరింత బలోపేతం అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. సీనియర్ నేత కొత్తూరు సుబ్బారావు మాట్లాడుతూ చిగురుపాటి కుమార్ స్వామి అనుభవజ్ఞుడని, ఆయన నాయకత్వంలో మోర్చా గ్రామ స్థాయికి మరింత విస్తరించబోతుందని తెలిపారు.

రాష్ట్ర కార్యదర్శి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో రైతుల సమస్యలు వినిపించేలా బలమైన కమిటీలు అవసరమని సూచించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, గ్రామపంచాయతీ కమిటీల రాష్ట్ర కన్వీనర్ వై.వి. సుబ్బారావు, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ అనిత, గుంటూరు జిల్లా పార్లమెంటు సంయోజకుడు భీమినేని చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు బజరంగ్ రామకృష్ణ, దేసు సత్యనారాయణ, తోట శ్రీనివాసరావు, కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

అలాగే ఎనిమిది జిల్లాల కిసాన్ మోర్చా అధ్యక్షులు, ఇతర రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరయ్యారు. సమావేశం చివర్లో రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకున్నారు.

About The Author

Latest News