అంతర్ జిల్లా బదిలీల ఉత్తర్వు జారీ పట్ల ఏపీటీఎఫ్ హర్షం

అంతర్ జిల్లా బదిలీల ఉత్తర్వు జారీ పట్ల ఏపీటీఎఫ్ హర్షం

అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : పాఠశాల విద్యలో అంతర్ జిల్లాల బదిలీల ఉత్తరువు జారీ చేయడం పట్ల ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు, యస్.చిరంజీవి హర్షం తెలియజేశారు.గత నాలుగు సంవత్సరముల నుండి అంతర్ జిల్లా బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వాలకు ఏపీటీఎఫ్ ప్రాతినిధ్యం చేయడం నేడు ఉత్తరువు జారీ చేయడం జరిగింది. ఇందులో కు స్పౌజ్ కు సంబంధించి 134 మంది, మ్యూచువల్ కు సంబంధించి 124 మంది ప్రధానోపాధ్యాయులు, వివిధ కేడర్ల ఉపాధ్యాయులు మొత్తం 258 మందికి ఈ బదిలీలు నిర్వహిస్తున్నారని తెలిపారు.  డీఎస్సీ నియామకాల కంటే ముందే నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరగా సానుకూలంగా స్పందించి ఈ బదిలీలు చేపడుతున్నందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ గారికి, పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు గారికి ధన్యవాదములు తెలిపారు. ఐతే స్పౌజ్ విషయంలో చాలా మందిని అనర్హులుగా చేసి అవకాశం ఇవ్వకపోవడం బాధాకరం అని, వారికి కూడా పునఃపరిశీలించి అంతర్ జిల్లా బదిలీలకు అవకాశం కల్పించాలని ఏపీటీఎఫ్ పక్షాన డిమాండ్ చేశారు.

About The Author

Latest News