రేషన్ పంపిణీలో అక్రమాలకు తావులేదు

రేషన్ పంపిణీలో అక్రమాలకు తావులేదు

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి హెచ్చరిక

రోడ్డుకు అడ్డముగా ఉన్న విద్యుత్తు స్తంభాలను పక్కకు తొలగించాలని ఆదేశం

గుంటూరు  పశ్చిమ నియోజకవర్గములో ఉన్న  చాకలికుంటను పరిరక్షిస్తా

గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ పంపిణీ వ్యవస్థ పై ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి మంగళవారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ సరఫరా, లబ్ధిదారుల వివరాలు, డీలర్ల పనితీరు, నియమ నిబంధనల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఎమ్మెల్యే గళ్ళా మాధవి  మాట్లాడుతూ....గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 95 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రతి షాపు తన పరిధిలో ఉన్న లబ్ధిదారులందరికీ సమయానికి సరుకులు అందించాలి. ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వారి హక్కుగా ప్రభుత్వ సరుకులు తప్పక అందాలి, ఇది అధికారుల బాధ్యత, డీలర్ల కర్తవ్యం” అని స్పష్టం చేశారు. ఎవరైనా రేషన్ పంపిణీ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. నాకు  ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా, నేను నేరుగా అధికారులను ప్రశ్నిస్తానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హెచ్చరించారు. కొందరు రేషన్ షాపులను వ్యాపార సంస్థల్లా నడుపుతున్నారు. ఇలాంటి ప్రవర్తన అస్సలు సహించం. డీలర్లు సిండికేట్‌లా వ్యవహరించడం కుదరదు. ప్రతి డీలర్ తన పరిధిలో ఉన్న ప్రజలకే సేవ చేయాలి. అవకతవకలకు తావు లేకుండా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసం ప్రభుత్వం పై నిలబెట్టడం మనందరి బాధ్యత. ఇక నుంచి గుంటూరు పశ్చిమలో రేషన్ పంపిణీ సమస్యలు రాకుండా కఠిన పర్యవేక్షణ ఉండాలి. నవంబర్ నెల నుండి ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదని  ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదేశించారు.

రోడ్డుకు అడ్డముగా ఉన్న విద్యుత్తు స్తంభాలను పక్కకు తొలగించాలి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న వివిధ డివిజన్ లలో రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్తు స్తంభాలను పక్కకు జరపి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించి డివిజన్ లలో రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్తు స్తంభాల చిత్రాలను అధికారులకి చూపించి వెంటనే వాటిని పక్కకు జరిపి ఏర్పాటు చేయాలని, దీని వలన ప్రజలు, వాహన చోదకులు రాత్రి పూట ప్రమాదాలకు గురవుతున్నారని వెంటనే ఈ పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదేశించారు.

చాకలికుంటను పరిరక్షిస్తా

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ 36వ డివిజన్ లో ఉన్న చాకలికుంట ఆక్రమణలకు గురయ్యిందని, వెంటనే సర్వే జరిపి ఈ కుంటను పరిరక్షించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి టౌన్ ప్లానింగ్ అధికారి నారాయణ స్వామి నీ ఆదేశించారు. అదే విధంగా కొండయ్య కాలనీలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదేశించారు.

About The Author

Latest News