బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలి

బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలి

- తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం

అమరావతి (జర్నలిస్ట్ ఫైల్ ) : 2025 మే నెలలో నిర్వహించిన బదిలీలలో బదిలీ కాబడి వేరే పాఠశాలకు వెళ్ళినప్పటికీ పాత పాఠశాల వద్ద రిలీవర్ లేకపోవడం వల్ల చాలా మంది ఉపాధ్యాయులు తిరిగి అదే పాఠశాల వద్ద డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. మెగా డీఎస్సీ–2025 రిక్రూట్ మెంట్ టీచర్లు చేరిన తరువాత అందరినీ రిలీవ్ చేసి తగిన న్యాయాన్ని అందిస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చారని, అయితే డీఎస్సీ–2025 ఖాళీలలో వారి స్థానాలను చూపనివ్వకపోవడం వల్ల ఉపాధ్యాయులు మళ్లీ అదే పాఠశాల వద్ద పనిచేయాల్సి వస్తోంది.

ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని డీఎస్సీ–2025 కౌన్సిలింగ్ పూర్తి అయిన వెంటనే 2025 బదిలీలలో స్థాన చలనం పొందిన అన్ని ఉపాధ్యాయులను తక్షణమే రిలీవ్ చేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష మన్నం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రామి శెట్టి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు..అలాగే, సెలవు దినాల్లో 10వ తరగతి విద్యార్థుల కోసం పనిచేసిన ఉపాధ్యాయులకు సీ సీ ఎల్ మంజూరు చేయాలని సంఘం కోరింది.

About The Author

Latest News