ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం కృషి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో  కూటమి ప్రభుత్వం కృషి

– నోబుల్ టీచర్స్ అసోసియేషన్

అమరావతి (జర్నలిస్ట్ ఫైల్):  రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు తెలిపారు.

గత ఆరు సంవత్సరాలుగా శాశ్వత స్థానం లేకుండా పనిచేస్తున్న 1200 మంది లాంగ్వేజ్ పండిట్ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం మెమో నెం.14 జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు లభించడంతో ఆ ఉపాధ్యాయుల్లో ఆనందం నెలకొన్నదని వారు పేర్కొన్నారు.

అలాగే, తమ స్వస్థలాల నుండి దూరంగా విధులు నిర్వహిస్తూ కుటుంబాలనుంచి వేరుగా ఉన్న సుమారు 500 మంది ఉపాధ్యాయులకు అంతర్‌ జిల్లా బదిలీలు అమలు చేయడం ప్రభుత్వానికి మరో పాజిటివ్‌ అడుగు అని తెలిపారు.

ఉపాధ్యాయుల సంక్షేమం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని, తాజాగా వెలువడిన రెండు జీవోలు (పదోన్నతులు, బదిలీలు) ఉపాధ్యాయ సమాజానికి ఉత్సాహాన్ని నింపాయని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తారని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కొండూరు శ్రీనివాసరాజు, బొనిగల హైమారావు స్పష్టం చేశారు.

About The Author

Latest News