నిరుద్యోగుల ఆత్మబంధువు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్

నిరుద్యోగుల ఆత్మబంధువు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్

  • మోడల్ స్కూల్స్ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ అసోసియేషన్

అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పూర్తి చేయడం పట్ల మోడల్ స్కూల్స్ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కోమటిరెడ్డి శివ శంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.డి. షఫీ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు, వచ్చే మార్చిలో మరోసారి డీఎస్సీ నిర్వహిస్తామని లోకేశ్ ప్రకటించడాన్ని సంఘం అభినందించింది. ఇదే కారణంగా ఆయన నిరుద్యోగుల ఆత్మబంధువుగా నిలిచారని పేర్కొంది.

ఈ విజయవంతమైన నియామక ప్రక్రియకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డీఎస్సీ ప్రక్రియను పక్కడబందీగా అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన పాఠశాల విద్యా కమిషనర్ విజయ రామ రాజు, డీఎస్సీ కన్వీనర్ యం. వెంకటక్రిష్ణారెడ్డి కి తమ కృతజ్ఞతలు తెలిపింది.

About The Author

Latest News