కార్మికులకు అండగా నిలవండి

కార్మికులకు అండగా నిలవండి

 ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండి
టీఎన్టీయూసీ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే నసీర్

 

గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : కార్మికులకుటీఎన్టీయూసీ నాయకులు అండగా నిలవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ సూచించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ టీఎన్టీయూసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక తూర్పు శాసనసభ్యుల వారి కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ తూర్పు నియోజకవర్గం కమిటీ అధ్యక్షునిగా కొల్లా శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఆటో డ్రైవర్లకు చెప్పకుండానే 15 వేల రూపాయలు అందించి వారి ఆర్థిక ప్రగతికి వెన్నుదన్నుగా నిలిచారని పేర్కొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కార్మికులకు ఏ సమస్య వచ్చినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గం లో అన్ని రంగాలలోని కార్మికులకు తాము అండగా నిలుస్తున్నామని తెలిపారు. కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా అందే ప్రయోజనాలను కార్మికులకు తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిశీలికులు గంజం రాఘవేంద్ర,టీఎన్టీయూసీ అధ్యక్షులు కొల్లా శ్రీనివాసరావు, అచ్చి కిరణ్, మేనుముల శ్రీకాంత్, ఉప్పు తల నరసింహారావు, గఫార్, తాడిశెట్టి శ్రీను, అద్దంకి కొండలు, త్రిపర్ణ ఈశ్వరరావు, అరవేపల్లి రాజేష్ భాను, సంకూరి వంశీకృష్ణ, ముత్యాలరావు, ఫణి కుమార్ బల్లేపల్లి ఫణి కుమార్, మొవ్వ శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, వీర వసంతరావు, సురేష్, శంకర్ బాబు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

About The Author

Latest News