భాషా పండితుల పదోన్నతులపై హర్షం
భాషా పండితుల పదోన్నతులపై హర్షం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓ పూల్‌లో ఉన్న 1209 మంది భాషా పండితులను తెలుగు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు ఇవ్వడం హర్షనీయం అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా శాశ్వత స్థానాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న భాషా పండితులకు ఈ పదోన్నతులు సంతోషాన్ని తెచ్చాయని చెప్పారు. గతంలో వారిని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా నియమించగా, ఇప్పుడు అదే పోస్టులో కొనసాగుతూ తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి ఇవ్వడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
ఈ నిర్ణయానికి సహకరించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజుకు ధన్యవాదాలు తెలిపారు. భాషా పండితుల సమస్య పరిష్కారం కోసం ఎస్‌ఎల్‌టిఎ నేతలతో కలిసి శశిధర్‌ను కలిసిన సమయంలో ఇచ్చిన హామీ ఫలితంగానే ఈ పదోన్నతులు సాధ్యమయ్యాయని ఆయన గుర్తుచేశారు.