ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు

నోబుల్ టీచర్స్ అసోసియేషన్ నేతలతో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ 

గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్‌ను, బాపట్ల ఎమ్మెల్యే వేగిశన నరేంద్ర వర్మరాజును తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో కలిసి తమ అభిప్రాయాలను తెలియజేశారు.

ఇటీవల గుంటూరు జిల్లా, నగర నూతన కమిటీలు ఏర్పడిన సందర్భంలో ఎమ్మెల్యే నాయకులను అభినందించారు. జిల్లా అధ్యక్షుడు పి. సాయి విశ్వనాథ్‌కు శాలువా కప్పి ప్రత్యేక సన్మానం చేశారు.

ఈ సందర్భంగా మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ,“నోబుల్ టీచర్స్ అసోసియేషన్ మన తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంఘం” అని విద్యాశాఖ మంత్రి నారా లోకೇಶ್ పార్టీ సమావేశంలో అధికారికంగా ప్రకటించారని గుర్తుచేశారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ స్థాయిలో ఈ సంఘంతో కలిసి పని చేయాలని అన్ని ఎమ్మెల్యేలకు సూచనలు ఇచ్చినట్టు వివరించారు.

“ఉపాధ్యాయుల సమస్యలను నిర్లక్ష్యం చేయం. త్వరలోనే నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారాలకు చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. హైమారావు, అనంతపురం జిల్లా నాయకుడు శివశంకర్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు పి. సాయి విశ్వనాథ్, అసోసియేట్ అధ్యక్షుడు పి. లలిత బాబు, నగర అధ్యక్షుడు కె.వి. రాఘవులు, నగర ఆర్థిక కార్యదర్శి షేక్ రషీద్, నగర ఉపాధ్యక్షుడు టి. రవి తదితరులు పాల్గొన్నారు.

 

About The Author

Latest News