నాదెండ్ల... ఆలపాటి పై ఈ కుట్రలు భావ్యమేనా !? 

నాదెండ్ల... ఆలపాటి పై ఈ కుట్రలు భావ్యమేనా !? 

అంతులేని ప్రజాభిమానమే ఆలపాటికి శాపమైందా ?
 
'ఆలపాటి' ని తొక్కేస్తాం అంటున్న నాదెండ్ల బ్యాచ్
 
తొక్కడం కాదు... అడ్రస్ లేకుండా చేస్తామంటూ ఆలపాటి బ్యాచ్ ప్రతి సవాల్
 
విధేయతతే ఆలపాటికి శాపమా
 
టీడీపీ అధినేత మాటకు గౌరవించి తెనాలిని త్యాగం చేయడమే ఆలపాటి చేసిన తప్పా?
 
పొలిటికల్ డెస్క్ ( జర్నలిస్ట్ ఫైల్ ) మార్చి 23  : తెనాలి నియోజకవర్గంలో వెన్నుపోటులు, కుట్రలు రాజకీయంగా కాకరేపుతున్నాయి.  జనసేనకు తెనాలి సీటును త్యాగం చేయడమే కాకుండా, గెలుపుకు కూడా నిస్వార్ధంగా కష్టపడుతున్న ఆలపాటి రాజాపై నాదెండ్ల మనోహర్ కుట్ర చేస్తున్నారంటూ ఒక్కసారిగా టీడీపీ శ్రేణుల్లో గగ్గోలు మొదలైంది. ఇందుకు సంబంధించి టీడీపీ శ్రేణులు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి...
 
తమ నాయకుడి త్యాగంతో కూటమి తరపున టిక్కేట్ దక్కించుకున్న జనసేన నాయకుడు నాదేండ్ల మనోహర్... నేడు తమ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను రాజకీయంగా తొక్కేసేందుకు తెరవెనుక రాజకీయ కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు మండిపడుతున్నారు. ఎక్కడా ఎవరు బహిర్గతంగా మాట్లాడనప్పటికి అంతర్గత సంభాషణల్లో మాత్రం  ఒకళ్ళను ఒకరు తొక్కేస్తాం మంటూ సవాల్ , ప్రతి సవాల్ చేసుకుంటున్నారు. 
 
గత రెండు రోజులుగా తెనాలి రాజకీయం కాక రేగుతోంది. కూటమి తరుపున టిక్కేట్ దక్కించుకున్న జనసేన నాయకుడు నాదేండ్ల మనోహర్... తమ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను రాజకీయంగా తొక్కేసేందుకు తెరవెనుక రాజకీయ కుట్రలు చేశారనే విషయం స్థానిక టీడీపీ శ్రేణుల్లో వ్యాపించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
 
తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజాకు అక్కడి ప్రజల్లో అమితమైన అభిమానం, పట్టు ఉంది. 2014 ఎన్నికల్లో 93, 524 ( 48 శాతం) ఓట్లు సాధించి రాజా  విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో  వైసీపీ హవా ఉదృత్తంగా కొనసాగినప్పటికీ కూడా 76,846 ఓట్లు ( 38 శాతం ) సాధించి కేవలం   9 శాతం అంటే 17, 649 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. అయినప్పటికీ నాటి నుంచి కూడా నియోజకవర్గాన్ని ఒక రోజు కూడా విడవకుండా కోట్ల రూపాయలు వెచ్చించి గత ఐదేళ్లుగా  అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోట గా మలిచారు. గత కొద్ది నెలల ముందు జరిగిన సర్వేలల్లో సైతం టీడీపీ తరుపున ఆలపాటి రాజా పోటీ చేస్తే 54 శాతం ఓట్లు టీడీపీకే పోలవుతాయని వెల్లడైంది. 
 
ఆలపాటి రాజా కష్టాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకున్న   జనసేన నాయకుడు మనోహర్ తనకే తెనాలి టిక్కేట్ అని పట్టు పట్టి మరి సాధించుకున్నారు.  అయితే 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన నాదేండ్ల మనోహర్ సాధించిన కేవలం 14 శాతం అంటే 29,905 ఓట్లు మాత్రమే. కేవలం 14 శాతం ఓట్లు సాధించిన  జనసేన మనోహర్...తాను  48 శాతం ఓట్లు సాధించిన  తెనాలి సీటును అడిగినప్పటికీ... పార్టీ అధినేత నిర్ణయం , కూటమీ ప్రయోజనాలే  ముఖ్యమంటూ తెనాలి సీటును హుందాతనంతో త్యాగం చేశారు ఆలపాటి రాజా.
 
మరి ఇన్నేళ్లుగా అక్కడ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న తమ నాయకుడు ఆలపాటి రాజా సంగతేమిటి? అనే ప్రశ్న టీడీపీ శ్రేణుల నుంచి ఎదురైంది. మన పార్టీ అధినాయకులు చంద్రబాబు, లోకేష్ లు తనకు ఏదో మార్గం చూపిస్తారనే విశ్వాసం తనకు ఉందని పార్టీ క్యాడర్ కు ఇన్నాళ్ళుగా సర్ది చెబుతూ వచ్చారు.
 
అయితే టీడీపీ విడుదల చేసే రెండో, మూడో జాబితాల నుంచి ఆలపాటి పేరును హఠాత్తుగా తప్పించడం తో షాక్ గురయ్యారు. ఎందుకిలా తమదైన  జరిగిందని ఆరా తీసిన వారికి నాదెండ్ల అడ్డుకున్న కారణంగానే ఆలపాటికి సీటు రాలేదనే కుట్ర బహిర్గతమైందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.
 
అంతులేని ప్రజాభిమానమే ఆలపాటికి శాపమైందా ?
 
తెనాలిలో ఆలపాటి రాజాకు ఉన్న ప్రజాభిమానమే  నేడు ఆయనకు శాపంగా మారి ఆరవై ఏళ్ల వయసులో రాజకీయ జీవితం ప్రశ్నార్ధకమై,  దారితెన్ను తెలియని స్థితిలో నిలబెట్టింది అంటున్నారు టీడీపీ శ్రేణులు. 
 
రాజకీయంగా నిత్యం పవన్ కల్యాణ్ సేవలోనే గడిపేస్తూ ఉండినప్పటికీ.. ఎన్నికల సీజను వచ్చే సరికి వాయుమార్గంలో వచ్చి.. తెనాలి సీటు దక్కించుకున్నారు నాదెండ్ల మనోహర్. తెనాలిలో తన సొంత బలం పరిమితంగానే ఉండగా..  గత ఐదేళ్లుగా ఆలపాటి రాజా కష్టంతో తెనాలిలో బలీయమైన శక్తిగా మారిన తెలుగుదేశం బలం కూడా తోడైతే ఎమ్మెల్యేగా గెలవచ్చునని అనుకున్న నాదెండ్ల ... టీడీపీ అధినేత చంద్రబాబు పై అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చి జనసేన కోటాలో తెనాలి సీటును తనకు దక్కించుకున్నారు.
 
కంటగింపుతో కుట్రకు అంకురార్పణ
 
తెనాలి సీటును దక్కించుకున్న నాదెండ్ల ఎప్పుడైతే తెనాలి లో అడుగుపెట్టారో... ఆ క్షణం నుంచే ఆలపాటిపై నాదేండ్ల కుట్రలకు  అంకురార్పణ జరిగింది అంటున్నారు టీడీపీ క్యాడర్. ఎన్నికలకు సమాయాత్తం అయ్యేందుకు తెనాలిలో పర్యటనలు మొదలుపెట్టిన నాదెండ్లకు... నియోజకవర్గంలో ఆలపాటికి ఉన్న బలం, ప్రజా ఆదరణ అవాక్కయ్యేలా చేసింది అంటున్నారు. ఆలపాటి రాజాకు ఉన్న ప్రజాభిమానం నాదెండ్లకు కంటగింపు మారింది అని చెబుతున్నారు.  
 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు కూటమి ప్రయోజనాల కోసం ఆలపాటి తెనాలిని  త్యాగం చేసినప్పటికినాదెండ్ల సంతోషపడలేదంటున్నారు. తెనాలి నుంచి హుందాగా తప్పుకున్న ఆలపాటి... మరో నియోజకవర్గం నుంచి గెలుపొందినా, లేదంటే రాజకీయాల్లో కొనసాగినా... తెనాలి ప్రజలు  ఆలపాటితో అనుబంధం కొనసాగిస్తారని, అదే జరిగితే ఎమ్యెల్యేగా గెలిచినా కూడా తనకు తెనాలిపై పూర్తి స్థాయిలో పట్టు దొరకదని అభద్రతా భావంతో నాదెండ్ల ఉన్నట్లుగా చెబుతున్నారు. 
 
అదే అసలు పూర్తిగా ఆలపాటిని రాజకీయ సమాధి చేస్తే.. తెనాలిలో తన పెత్తనానికి ఏ ఇబ్బంది ఉండదని... అందుకే ఏ నియోజకవర్గంలో కూడా టీడీపీ ఆలపాటికి టిక్కెట్ కేటాయించకుండా చంద్రబాబు వద్ద నాదెండ్ల అడ్డుపడుతున్నారని  తమకు ఖచ్చితమైన సమాచారం ఉందని అంటున్నారు టీడీపీ శ్రేణులు.
 
ఆలపాటి పై కుట్రలు ఇలా...
 
 తెలుగుదేశంలో సీనియర్ నాయకుడైన ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా పట్టున్న నాయకుడు. గత పాతికేళ్లుగా ఆయన నివాసం అదే నియోజకవర్గంలో ఉంది. ఆయనకు ఆ నియోజకవర్గంలో ప్రతి వార్డులో బలమైన అనుచరగణం, అభిమానులు ఉన్నారు. ఇటీవల గుంటూరు పశ్చిమలో టీడీపీ నిర్వహించిన ఐవీఆర్ ఎస్ సర్వేలో కూడా ఆలపాటి అభ్యర్ధిత్వానికి భారీ మద్దతు లభించింది.
 
దీంతో తెనాలి త్యాగం చేసిన ఆలపాటికి ప్రత్యామ్నాయంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఇవ్వడం ఖరారై పోయిందనే హామీ వచ్చింది. ఇక టీడీపీ రెండవ జాబీతాలో గుంటూరు పశ్చిమ కు ఆలపాటి రాజా పేరు ప్రకటించడం లాంచనమే అని టీడీపీ అధిష్టానం చెప్పిన తరుణంలో...  చంద్రబాబు నాయుడు మీద  నాదెండ్ల ఒత్తిడి తెచ్చి , ఆలపాటికి టిక్కెట్ దక్కకుండా చేశారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు చివరకు టీడీపీ సభ్యత్వం కూడా లేని మాధవీలతను గుంటూరు పశ్చిమలో టీడీపీ బరిలోకి దించాల్సి వచ్చింది.
 
అయినప్పటికీ ఆలపాటికి రాజా కు ఏదో ఒక సీటు సర్దుబాటు చేరస్తారనే ఆశ ఆయన అభిమానుల్లో , టీడీపీ శ్రేణుల్లో ఇన్నాళ్లు ఉండేది . చివరకు మూడో జాబితాలో పెనమలూరు సీటు ఖరారు చేయబోతున్న నేపథ్యంలో మళ్లీ నాదేండ్ల రంగప్రవేశం చేసి చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి మూడో జాబితాలో కూడా సీటు లేకుండా చేశారని టీడీపీ శ్రేణులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నాయి
 
ఒక విధంగా ఆలపాటి పార్టీ పట్ల విధేయతతో చేసిన త్యాగం , ఆలపాటికి తెనాలిలో ఉన్న ప్రజాదరణపై నాదెండ్ల కలిగిన కంటగగింపు... నిఖార్శైన నాయకుడిగా పేరొందిన రాజా రాజకీయ జీవితాన్ని, ఆయన అనుచరుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చేసింది అని  టీడీపీ శ్రేణులు  ఆవేదన చెందుతున్నారు.. రేపు నాదెండ్ల కు ఎమ్మెల్యేగా గెలుపొందితే ఆలపాటి రాజకీయ జీవితానికి సమాధి కట్టే ప్రయత్నం చేసినట్లుగానే... తనకు ఎదురు లేకుండా ఉండటానికి తెనాలిలో టీడీపీ పార్టిని సైతం సమాధి చేసేందుకు ప్రయత్నించడం ఖాయం అని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు
 
ఆట నాదెండ్ల మొదలెట్టారు... ముగింపు మేము ఇస్తామంటున్న ఆలపాటి అనుచరులు
 
టీడీపీ - జనసేన కూటమి ప్రయోజనాల కోసం, టీడీపీ అధినేత నిర్ణయాన్ని శిరసావహించి, హుందాగా నాదెండ్ల మనోహర్ కోసం సీటును త్యాగం చేయడమే కాకుండా, ఆయన గెలుపు కోసం చిత్తశుద్దితో, నిస్వార్ధంగా  కృషి చేస్తున్న ఆలపాటి రాజా పై నాదెండ్ల కుట్రలు చేస్తూ , రాజా కు  రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తున్న ప్రయత్నాలపై టీడీపీ క్యాడర్ తీవ్ర ఆగ్రహంగా ఉంది . ఈ పరిణామాల్ని ఆలపాటి, ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఏ నియోజకవర్గంలో సీటు దక్కకుండా శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టేందుకు యత్నిస్తున్నారని ఆలపాటి అనుచరులు  మండిపడుతున్నారు . ఈ సవాల్ ను తాము స్వీకరిస్తున్నామని, నాదెండ్ల మొదలు పెట్టిన ఈ ఆటకు సరైన ముగింపు తాము ఇస్తామని అని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
రేపటి సంచికలో .... "మన ఆలపాటి... మన ఆత్మగౌరవం"

About The Author

Related Posts

Latest News

ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం
ప్రత్తిపాడు, జూలై 5 (జర్నలిస్ట్ ఫైల్): భారతీయ జనతా పార్టీ ప్రత్తిపాడు మండలంలో విస్తృత స్థాయి సమావేశం శనివారం మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి...
ఆపరేషన్ సిందూర్: బాజీరావు విగ్రహావిష్కరణలో మోడీ ప్రభుత్వం చారిత్రక సంకల్పానికి అమిత్ షా ఘనప్రశంస
అవయవ దాన ప్రచారానికి అంకితమైన సేవలకు కేంద్ర పురస్కారం – నాగార్జున చేతుల మీదుగా నరసింహారెడ్డికి గౌరవం
రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ 
గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్ రెడ్డిది
మైదుకూరులో "రీ కాల్ చంద్రబాబు" సభకు భారీ స్పందన
వంశీని పరామర్శించిన కొడాలి, పేర్ని – తెలప్రోలులో ముగ్గురు నేతల సన్నిహిత సమావేశం