హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎప్‌సెట్–2025 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,07,190 మంది పరీక్షలు రాయగా 1,51,779 మంది (73.26%) ఉత్తీర్ణత సాధించారు. ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల్లో 81,198 మంది హాజరవగా, 71,309 మంది (87.82%) ఉత్తీర్ణులయ్యారు.
టాపర్ల జాబితాలో అబ్బాయులదే ఆధిపత్యం
ఇంజినీరింగ్ విభాగంలో టాప్ 10 ర్యాంకులు అన్నీ అబ్బాయిలే దక్కించుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో టాప్ 10లో ఒక్క బ్రాహ్మణి రెండ్ల మాత్రమే మహిళా అభ్యర్థిగా నిలిచారు. ఆమెకు ఐదవ ర్యాంకు వచ్చింది.
ఇంజినీరింగ్ టాపర్లు:
-
పల్లా భరత్ చంద్ర (కొమరాడ, పార్వతీపురం మన్యం, ఏపీ)
-
ఉడగండ్ల రామ్‌చరణ్ రెడ్డి (మాదాపూర్)
-
పమ్మిన హేమ సాయి సూర్య కార్తీక్ (విజయనగరం, ఏపీ)
-
మెండె లక్ష్మీభార్గవ్ (నాచారం)
-
మంత్రిరెడ్డి వెంకట గణేశ్ రాయల్ (మాదాపూర్)
-
సుంకర సాయి రిశాంత్ రెడ్డి (మాదాపూర్)
-
దుష్మిత్ బండారి (మాదాపూర్)
-
బనిబ్రత మాజే (బడంగ్‌పేట్)
-
కొత్త ధనుష్ రెడ్డి (నార్సింగి)
-
కొమ్మ శ్రీ కార్తీక్ (మేడ్చల్)
ఫార్మా, అగ్రికల్చర్ టాపర్లు:
-
సాకేత్ రెడ్డి (మేడ్చల్)
-
సబ్బాని లలిత్ వరేణ్య (కరీంనగర్)
-
చాడ అక్షిత్ (వరంగల్)
-
పెద్దింటి రచ్చల సాయినాథ్ (కొత్తకోట, వనపర్తి)
-
బ్రాహ్మణి రెండ్ల (మాదాపూర్)
-
గుమ్మడిదల తేజస్ (కూకట్‌పల్లి)
-
కొలన్ అఖిరానందన్ రెడ్డి (నిజాంపేట)
-
భానుప్రకాశ్ రెడ్డి (సరూర్‌నగర్)
-
అర్జ శామ్యూల్ సాత్విక్ (హైదర్‌గూడ)
-
అద్దుల శశికిరణ్ రెడ్డి (బాలాపూర్)
ఫలితాలు నేరుగా సెల్‌ఫోన్‌కి
ఈసారి ఎఫ్‌సెట్ ఫలితాలను విద్యార్థుల మొబైల్ నెంబర్లకు నేరుగా ఎస్‌ఎంఎస్ ద్వారా పంపించారు. ఫలితాల వెబ్‌సైట్: https://eapcet.tgche.ac.in
అభ్యంతరాలపై రీఫండ్ విధానం
ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలుపాలంటే ప్రశ్నకు రూ.500 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉండగా, తప్పు తేలితే పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నారు. ఈసారి ఒక విద్యార్థి అభ్యంతరం సరైందని తేలింది.
ఉత్తీర్ణత శాతం స్వల్పంగా తగ్గింది
గత ఏడాది ఇంజినీరింగ్‌లో 74.98% కాగా ఈసారి 73.26%కి పడిపోయింది. ఫార్మా-అగ్రికల్చర్ విభాగంలో మాత్రం మెరుగుదల కనిపించింది. గత ఏడాది 86.67% కాగా ఈసారి 87.82% నమోదైంది.
పరీక్షలు విజయవంతం
ఏప్రిల్ 29, 30న ఫార్మా, అగ్రికల్చర్ ఎఫ్‌సెట్, మే 2, 3, 4న ఇంజినీరింగ్ ఎఫ్‌సెట్ పరీక్షలు నిర్వహించారని అధికారులు తెలిపారు.