సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాలు విడుదల – విజయవాడ టాప్‌

v

సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాలు విడుదల – విజయవాడ టాప్‌

 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) 12వ తరగతి ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఈసారి మొత్తం ఉత్తీర్ణత శాతం 88.39 శాతంగా నమోదైంది. ఇది గతేడాది కంటే 0.41 శాతం అధికం.

బాలికలు మరోసారి బాలురపై ఆధిపత్యం చూపారు. ఈసారి 91 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇది బాలుర కంటే 5.94 శాతం అధికం కావడం విశేషం.

విజయవాడకు అగ్రస్థానం
విద్యార్థుల ఉత్తీర్ణత శాతంలో విజయవాడ 99.60 శాతంతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత తిరువనంతపురం 99.32 శాతం, బెంగళూరు 95.95 శాతం ఉత్తీర్ణతతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ మాత్రం 79.53 శాతంతో అత్యల్ప స్థాయిలో ఉంది.

ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు పరీక్షలు
ఈ ఏడాది సిబిఎస్‌ఇ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించాయి. 12వ తరగతికి దేశవ్యాప్తంగా 16 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 14 లక్షలకుపైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

ఈ పరీక్షలు 7,842 పరీక్షా కేంద్రాల్లో, విదేశాల్లోని 26 ప్రాంతాల్లో నిర్వహించారు. సిబిఎస్‌ఇ పదవ తరగతి ఫలితాలు కూడా ఇదేరోజు విడుదల కానున్నట్లు సమాచారం

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని