గుంటూరులో భారీగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్
On
గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్‌కి చెందిన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామిరెడ్డి తోటలో మంగళవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్రువీకరణ పత్రాలు లేని భారీ సంఖ్యలో వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మొత్తం 66 బైకులు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనుమానితుల నుంచి వేలిముద్రలు సేకరించినట్టు వెల్లడించారు. వారిలో నలుగురు రౌడీషీటర్లు ఉన్నట్లు గుర్తించామని, మరో వ్యక్తి ఇతర ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడని చెప్పారు. గుంటూరు నగరంలో అసాంఘిక చర్యలను అరికట్టేందుకు ఇలాంటి సెర్చ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగిస్తామని ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు.
About The Author
Latest News
16 May 2025 19:32:02
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్
గుంటూరు (...