అభిమాన హీరో వెంకటేశ్‌తో కలిసి నటించబోతున్న శ్రీవిష్ణు!

‘#సింగిల్’ విజయంతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన యువ కథానాయకుడు

అభిమాన హీరో వెంకటేశ్‌తో కలిసి నటించబోతున్న శ్రీవిష్ణు!

యువ కథానాయకుడు శ్రీవిష్ణుకు విక్టరీ వెంకటేశ్ అంటే ఎంతగా ఇష్టం ఉందో సినీ ప్రేక్షకులకు తెలిసిందే. మీడియా వేదికగా ఎన్నోసార్లు ఆయనను తన అభిమాన హీరోగా పేర్కొన్న శ్రీవిష్ణు, ఇప్పుడు ఆ కలను నెరవేర్చే దశలో ఉన్నాడు.

ఇటీవలే విడుదలైన '#సింగిల్' సినిమాలో పలువురు స్టార్ హీరోలను ఇమిటేట్ చేసిన శ్రీవిష్ణు... క్లైమాక్స్‌లో మాత్రం వెంకటేశ్‌ మేనరిజంలను అద్భుతంగా కాపీ చేసి థియేటర్లలో హాస్య వాతావరణాన్ని నెలకొల్పాడు. ఆ సినిమా మొదటి వారం ముగిసే సరికి దాదాపు రూ. 20 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఘనవిజయాన్ని అందుకుంది. గత కొన్ని సినిమాలతో పోలిస్తే ఇది శ్రీవిష్ణుకు పెద్ద హిట్‌గా నిలిచింది.

ఓ విశేషం ఏంటంటే... '#సింగిల్' విడుదలైన మే 9వ తేదీ, వెంకటేశ్‌కు సెంటిమెంట్ డేట్. అదే రోజున 1997లో వచ్చిన ‘ప్రేమించుకుందాం రా’ చిత్రం వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు అదే మే 9న శ్రీవిష్ణు భారీ హిట్ కొట్టడం ఆసక్తికరమైన విషయం. వెంకటేశ్‌ను అభిమానించే శ్రీవిష్ణుకు ఇది బాగా కలిసొచ్చింది అని చెప్పొచ్చు.

ఇప్పుడు అభిమానులందరికీ మజా అందించేందుకు మరో గుడ్ న్యూస్!
దర్శకుడు రామ్ అబ్బరాజు— గతంలో శ్రీవిష్ణుతో చేసిన ‘సామ జవర గమన’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు... ఇప్పుడు వెంకటేశ్, శ్రీవిష్ణును కలిపే స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఇటీవలే శ్రీవిష్ణు స్వయంగా వెల్లడించాడు. ‘‘నా అభిమాన నటుడితో కలిసి నటించాలనేది ఓ కల. అది త్వరలో నెరవేరబోతుంది’’ అని ఆనందాన్ని పంచుకున్నాడు.

ఇప్పటికే వెంకటేశ్ నటించిన సంక్రాంతి హిట్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రూ. 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అదే సమయంలో శ్రీవిష్ణు '#సింగిల్' విజయంతో బాక్సాఫీస్ వద్ద మళ్లీ తన స్థానం తిరిగి సంపాదించుకున్నాడు.

ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి చేయనున్న సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్టు సమాచారం. అభిమానులు మాత్రం ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ మీదికి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని