తెలంగాణలో వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల్లో మార్పులు – రోజుకు 10 గంటల పని అనుమతి
On
హైదరాబాద్: వాణిజ్య సంస్థలలో ఉద్యోగుల పని సమయాల్లో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రోజుకు గరిష్టంగా 10 గంటల వరకు పని చేయడానికి అనుమతి ఇచ్చినట్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారానికి పని గంటలు 48 గంటల పరిమితిని మించకూడదని స్పష్టం చేసింది.
పని గంటలు పెరిగినపుడు అదనంగా ఓవర్‌టైం (ఓటీ) వేతనం చెల్లించాల్సిందేనని స్పష్టంగా పేర్కొంది. అలాగే ఉద్యోగులు రోజుకు 6 గంటల పని అనంతరం కనీసం అరగంట విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉందని, విశ్రాంతి సమయాన్ని కలిపి రోజుకు 12 గంటల కంటే ఎక్కువగా పని చేయించకూడదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ నిర్ణయం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమంలో భాగంగా తీసుకున్నదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కొత్త మార్గదర్శకాలతో ఉద్యోగుల హక్కులను కాపాడుతూ, వ్యాపార రంగానికి అనుకూల వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని పేర్కొంది.
Tags: Telangana Labour Rules Working Hours Telangana Telangana Business News Telangana Labour Department Commercial Establishment Rules Telangana Government Orders Telangana Ease of Doing Business Employee Rights Telangana OT Payment Rules Telugu News Telangana Government Telangana New Labour Laws Working Hours Update Telangana Employment Rules TS Employee Work Hours Policy
About The Author
Latest News
05 Jul 2025 21:24:41
ప్రత్తిపాడు, జూలై 5 (జర్నలిస్ట్ ఫైల్): భారతీయ జనతా పార్టీ ప్రత్తిపాడు మండలంలో విస్తృత స్థాయి సమావేశం శనివారం మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి...