ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స అందించాలి

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స అందించాలి

 –ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చాంద్ బాష

గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు, పెన్షనర్లకు నెట్వర్క్‌ హాస్పిటళ్లలో పూర్తిస్థాయిలో నగదు రహిత వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు సంయుక్త కలెక్టర్‌ అశుతోష్ శ్రీ ఉత్సవకు వినతిపత్రం సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చాంద్ బాష, కార్యవర్గ సభ్యులు కలిసి, నెట్వర్క్‌ హాస్పిటళ్లలో ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో నగదు వసూళ్లు జరుగుతున్నాయని పేర్కొంటూ, హాస్పిటల్‌ యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి పకడ్బందీగా క్యాష్‌లెస్ చికిత్స అమలుచేయాలని కోరారు.

సంయుక్త కలెక్టర్‌ అశుతోష్ శ్రీ ఉత్సవ స్పందిస్తూ, “తప్పనిసరిగా హాస్పిటల్‌ యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేయిస్తాను. సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాము” అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు చాంద్ బాష, జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమతి యు. సుమిత్రా దేవి, జిల్లా సంయుక్త కార్యదర్శులు కోటాసాహేబ్, వి. కార్తీక్, నగర శాఖ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఈశ్వర్ ప్రసాద్, నగర శాఖ ఉపాధ్యక్షులు నాగారాజు, కోశాధికారి శ్రీనివాస్, మహిళా విభాగ నాయకులు రమణి, మయూరి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Latest News