డీఎస్సీ నూతన ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టడం హర్షనీయం: ఏపీటిఎఫ్

డీఎస్సీ నూతన ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టడం హర్షనీయం: ఏపీటిఎఫ్

అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఏపిటిఎఫ్ ప్రాతినిధ్యం మేరకు మెగా డీఎస్సీ- 2025 నూతన ఉపాధ్యాయులకు కొత్త పాఠశాలల ఎంపికను వెబ్ ఆప్షన్స్ ద్వారా కాకుండా రాష్ట్రంలోని ఎస్జీటీలందరికీ మాన్యువల్ కౌన్సిలింగ్ చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయ రాజు, ఎస్.చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నిర్ణయం ద్వారా నూతన ఉపాధ్యాయులు సంతృప్తితో ఉన్నారని తెలిపారు. నూతన ఉపాధ్యాయులను దృష్టిలో పెట్టుకొని సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి ఏపీటీఎఫ్ నాయకులు ధన్యవాదములు తెలిపారు. 

About The Author

Latest News