ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి 

ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి 

-“చలో ఢిల్లీ” ధర్నా కార్యక్రమానికి అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య పిలుపు

న్యూఢిల్లీ ( జర్నలిస్ట్ ఫైల్)  : దేశంలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు మాత్రమే పదోన్నతికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేయాలని సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య “చలో ఢిల్లీ” కార్యక్రమం నిర్వహించబోతోంది. నవంబర్ 24న జంతర్ మంతర్ వద్ద వేలాదిమంది ఉపాధ్యాయులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఈ నేపథ్యంలో, అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు బసవరాజ్ గురికర్ అధ్యక్షతన ఈ రోజు అత్యవసర గూగుల్ మీట్ సమావేశం జరిగింది. 25 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని చర్చించారన్నారు. ఈ అంశంపై తీసుకున్న నిర్ణయం గురించి అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య  జాతీయ కార్యనిర్వహక కార్యదర్శి ఎ జి ఎస్ గణపతి రావు మీడియాకు వివరించారు.

అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య జాతీయ సెక్రటరీ జనరల్ కమల్కాంత్ త్రిపాఠి మాట్లాడుతూ, ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలన్న/ టెట్ పై తమ నిర్ణయాన్ని మార్చాలని ఇప్పటికే రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ను కలిసి తగిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య నాయకులు కోరుతున్నారు అని ఆప్తా ప్రధాన కార్యదర్శి కె ప్రకాశ్ రావు పేర్కొన్నారు.

దర్నా కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ నుంచి 8,000 మంది, గుజరాత్ నుంచి 5,000 మంది, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల నుంచి 2,000 మంది, హిమాచల్, పంజాబ్, అస్సాం, మిజోరాం, మేఘాలయ, మణిపూర్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, దక్షిణాది రాష్ట్రాల నుంచి 500 మంది ఉపాధ్యాయులు పాల్గొననున్నారు.

అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య నేతలు ఈ కార్యక్రమం ద్వారా సుప్రీంకోర్టు తీర్పుపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసి, ఇన్సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడికి లోనుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

About The Author

Latest News