నిర్మల ఫార్మసీ రోటరాక్ట్ క్లబ్‌ ఇన్‌స్టాలేషన్, చార్టర్ ప్రెజెంటేషన్ ఘనంగా...

నిర్మల ఫార్మసీ రోటరాక్ట్ క్లబ్‌ ఇన్‌స్టాలేషన్, చార్టర్ ప్రెజెంటేషన్ ఘనంగా...

మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్)  :రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మంగళగిరి ఆధ్వర్యంలో నిర్మల కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ రోటరాక్ట్ క్లబ్‌ ఇన్‌స్టాలేషన్, చార్టర్‌ ప్రెజెంటేషన్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. రోటరీ ఇంటర్నేషనల్‌ డిస్ట్రిక్ట్‌ 3150 గవర్నర్‌ రోటేరియన్‌ డా. ఎస్‌.వి. రామ్‌ ప్రసాద్‌ ప్రధాన అతిథిగా పాల్గొని కొత్తగా ఎన్నికైన సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు.

డిస్ట్రిక్ట్‌ చైర్‌ (క్లబ్‌ అడ్మినిస్ట్రేషన్‌) పీడీజీ అన్నే రత్న ప్రభాకర్‌ విశిష్ట అతిథిగా, డిస్ట్రిక్ట్‌ రోటరాక్ట్‌ అడ్వైజరీ కమిటీ రీజినల్‌ చైర్‌ రోటేరియన్‌ జంగాల వెంకటేష్‌ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జొన్నాదుల కేదారేశ్వరి లక్ష్మి అధ్యక్షురాలిగా, బండి సంజన కార్యదర్శిగా, చల్లా కార్తికేయ శ్రీరామ్‌ ట్రెజరర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

కార్యక్రమానికి రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మంగళగిరి అధ్యక్షులు రోటేరియన్‌ ప్రగడ రాజశేఖర్‌ అధ్యక్షత వహించారు. సెక్రటరీ రోటేరియన్‌ పారేపల్లి నిరంజన్‌ గుప్తా, చైర్మన్‌ (రోట్రాక్ట్‌ క్లబ్‌లు) రోటేరియన్‌ జవ్వాది కిరణ్‌ చంద్‌ పాల్గొన్నారు.

నిర్మల ఫార్మసీ కళాశాల తరఫున సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ రెవరెండ్‌ సిస్టర్‌ జి. నిర్మల జ్యోతి, ప్రిన్సిపల్‌ డా. బి. పాముల రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డా. నరేష్‌ బాబు రేఖా, ఎం.ఫార్మసీ కోర్స్‌ కోఆర్డినేటర్‌ డా. లక్ష్మయ్య పాల్గొన్నారు.

డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ డా. ఎస్‌.వి. రామ్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ, రోటరాక్ట్‌ యువతకు సేవా దృక్పథం కలిగించే శక్తివంతమైన వేదికగా నిలుస్తుందని, విద్యార్థులు రోటరీ స్ఫూర్తితో సమాజానికి సేవ చేయాలని సూచించారు. ఈ క్లబ్‌ కార్యకలాపాలు నాయకత్వం, సామాజిక చైతన్యం పెంపొందిస్తాయని తెలిపారు.

రెవరెండ్‌ సిస్టర్‌ జి. నిర్మల జ్యోతి మాట్లాడుతూ, విద్యార్థులు రోటరాక్ట్‌ ద్వారా సేవా విలువలను ఆచరించడం గర్వకారణమని, ఈ క్లబ్‌ వ్యక్తిత్వ వికాసం, బాధ్యతాభావం పెంపొందించడంలో కీలకమని పేర్కొన్నారు.

అధ్యక్షురాలు జొన్నాదుల కేదారేశ్వరి లక్ష్మి మాట్లాడుతూ, రోటరాక్ట్‌ ద్వారా సమాజ సేవ, విద్యార్థుల నాయకత్వ నైపుణ్య అభివృద్ధి, రోటరీ విలువల అమలులో కృషి చేయడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

కార్యక్రమ ఏర్పాట్లలో బీఫార్మసీ, ఫార్మా–డి విద్యార్థులు ఎం. రవి, కె. భరత్‌, పి. నివేదిత స్పూర్తి, శ్రావణి సంధ్య, ఏ. ప్రతిమ, జె. రిషిత, యశ్వంత్‌, సిహెచ్‌. నాగేశ్వరరావు, నాని బాబు చురుకగా పనిచేశారు. వీరి వేదిక అలంకరణ, ఆతిథ్య ఏర్పాట్లు, సాంకేతిక నిర్వహణ, ప్రదర్శన సమన్వయంతో ఈ వేడుక విజయవంతమైంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళాశాల సామాజిక కార్యకలాపాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ చేపట్టిన పర్యావరణ అవగాహన, ఆరోగ్య శిబిరాలు, సేవా ప్రాజెక్టుల వివరాలు ఆకర్షణీయంగా ప్రదర్శించగా, సందర్శించిన అతిథులు కళాశాల సామాజిక బాధ్యత, విద్యార్థుల సృజనాత్మకతకు ప్రశంసలు తెలిపారు.

ఈ కార్యక్రమం ఆత్మకూరు లోని నిర్మల ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో సాయంత్రం 2.30 గంటలకు జరగగా, రోటరీ, రోటరాక్ట్ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

Latest News

నిర్మల ఫార్మసీ రోటరాక్ట్ క్లబ్‌ ఇన్‌స్టాలేషన్, చార్టర్ ప్రెజెంటేషన్ ఘనంగా... నిర్మల ఫార్మసీ రోటరాక్ట్ క్లబ్‌ ఇన్‌స్టాలేషన్, చార్టర్ ప్రెజెంటేషన్ ఘనంగా...
మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్)  :రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మంగళగిరి ఆధ్వర్యంలో నిర్మల కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ రోటరాక్ట్ క్లబ్‌ ఇన్‌స్టాలేషన్, చార్టర్‌ ప్రెజెంటేషన్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది....
మంగళగిరి చిన్నారుల మెరిసే ప్రతిభ... రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపిక
మంత్రివర్గ ఉపసంఘ ఏర్పాటుపై గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక హర్షం
రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె దిశగా సమగ్ర శిక్ష ఉద్యోగులు !
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి
న్యాయం కోసం 'ఏపీ జేఏసీ అమరావతి' పోరుబాట !
ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి