సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు - మంత్రి ఫరూక్ హర్షం

సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు - మంత్రి ఫరూక్ హర్షం

అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రావడంపై రాష్ట్ర న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి. ఫరూక్ హర్షం వ్యక్తం చేశారు.గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండవ రోజు కార్యక్రమంలో సీఎంకు మంత్రి ఫరూక్ అభినందనలు తెలిపారు. వినూత్న విధానాలతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న గణనీయమైన ఆర్థిక అభివృద్ధికి ఈ అవార్డు ప్రతీకగా నిలిచిందన్నారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు బదులు ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దేశానికే ఆదర్శప్రాయం గా నిలవడం ఖాయమని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం భవిష్యత్తులో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.పెట్టుబడిదారులకు విశ్వసనీయత, పారదర్శకత కల్పించిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని అన్నారు. రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దేoదుకు వినూత్న సంస్కరణలతో, అన్ని రంగాలలో ఆదర్శంగా నిలిచేందుకు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ ముందంజ లో ఉందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఉపయుక్తంగా ఉంటుందనే న్యాయ వ్యాజ్య విధానం-2025 (ఏపీ స్టేట్ లిటిగేషన్ పాలసీ) రూపొందించడానికి సీఎం నిర్ణయించి, మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News

సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్
అభినందనలు తెలిపిన మంత్రులు, సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లు ధైర్యంతో సంస్కరణలు చేయడం చంద్రబాబుకే సాధ్యమన్న మంత్రి పయ్యావుల ముఖ్యమంత్రికి అవార్డు రావడం రాష్ట్రానికే గర్వకారణమన్న అచ్చెన్నాయుడు టీమ్...
ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహా సభను జయప్రదం చేయాలి: బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు
సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు - మంత్రి ఫరూక్ హర్షం
ఎన్జీజీవో విజయం - 11 మంది పీహెచ్సీ సిబ్బందిపై సస్పెన్షన్ల ఎత్తివేత 
 చైల్డ్ కేర్ లీవ్‌పై వయోపరిమితి తొలగింపు – ఎన్జీజీఓ మహిళా ఉద్యోగుల కృతజ్ఞతలు
మహిళా క్రికెటర్ శ్రీచరణికి నగదు ప్రోత్సాహకం అందజేత
చైల్డ్ కేర్ లీవ్ సడలింపుపై ఏపీ జేఏసీ అమరావతి హర్షం