యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 8వ మహాసభలు విజయవంతం

యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 8వ మహాసభలు విజయవంతం

విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 8వ మహాసభలు మంగళవారం విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వైద్య–ఆరోగ్య శాఖలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రతినిధులుగా పాల్గొని, శాఖలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. భవిష్యత్ కార్యాచరణ, కర్తవ్యాలను మహాసభ నిర్ణయించింది.

ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. వారు మాట్లాడుతూ, పీపీపీ విధానం పేరుతో మెడికల్ కాలేజీలు, వైద్య–ఆరోగ్య శాఖలను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. వైద్య విద్య, ఆరోగ్య సేవలను ప్రభుత్వమే నిర్వహించాలంటూ, ఆ దిశగా యూనియన్లు బలంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

యూనియన్ గౌరవాధ్యక్షులు ఏ.వి.ఎన్. మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని, ఇకపై ఖాళీ పోస్టులన్నింటినీ శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ లక్ష్యాల సాధనకు యూనియన్ చురుగ్గా పనిచేయాలని సూచించారు.

అనంతరం వైద్య–ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలపై చర్చించి, 12వ పీఆర్‌సీని వెంటనే అమలు చేసి ఐఆర్ ప్రకటించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను పటిష్టంగా అమలు చేయాలని, ఉద్యోగులపై యాప్‌ల భారం తగ్గించాలని వంటి అంశాలతో 12 తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Tags:

About The Author

Latest News

యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 8వ మహాసభలు విజయవంతం యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 8వ మహాసభలు విజయవంతం
విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 8వ మహాసభలు మంగళవారం విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా...
మెకానికల్ లు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి
స్వర్ణాంధ్ర సాధన లో నూతన జాతీయ విద్యా విధానం ప్రముఖ పాత్ర
ఘనంగా టీడీపీ నేత పోతినేని జన్మదిన వేడుకలు
ఎస్ఆర్ఎం వర్సిటీకి క్యూ ఎస్ఐ - గేజ్ హ్యాపీనెస్ అవార్డు.
 మంగళగిరి డాన్ బోస్కో స్కూల్ పుస్తకావిష్కరణ
డాన్ బాస్కో అంటే ప్రేమ, సేవ