చైల్డ్ కేర్ లీవ్‌పై వయోపరిమితి తొలగింపు – ఎన్జీజీఓ మహిళా ఉద్యోగుల కృతజ్ఞతలు
విజయవాడ(జర్నలిస్ట్ ఫైల్) మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్‌పై ఉన్న వయోపరిమితిని పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, గుంటూరు జిల్లా మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కృషి చేసిన ఏపీ ఎన్జీజీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఏ. విద్యాసాగర్‌కు, అలాగే ప్రధాన కార్యదర్శి డి. రమణకు గుంటూరు జిల్లా మహిళా ఉద్యోగులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మహిళా ఉద్యోగుల సంక్షేమానికి ఈ ఉత్తర్వులు మైలురాయిగా నిలుస్తాయని వక్తలు పేర్కొన్నారు. పిల్లల వయస్సుతో సంబంధం లేకుండా, మహిళా ఉద్యోగులు తమ సేవా కాలమంతా చైల్డ్ కేర్ లీవ్‌ను వినియోగించుకునే అవకాశం కల్పించడం ద్వారా ఉద్యోగ–కుటుంబ సమతుల్యత మరింత మెరుగవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీజీఓ సంఘ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి శ్యామ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షరీఫ్, బాపట్ల జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. మహిళా నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
.jpeg)

