చైల్డ్ కేర్ లీవ్‌పై వయస్సు పరిమితి తొలగింపు అభినందనీయం :ఎన్‌జీజీఓ

చైల్డ్ కేర్ లీవ్‌పై వయస్సు పరిమితి తొలగింపు అభినందనీయం :ఎన్‌జీజీఓ

అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): పిల్లల వయస్సుతో సంబంధం లేకుండా మహిళా ఉద్యోగులు తమ సర్వీస్ కాలం మొత్తం ఎప్పుడైనా చైల్డ్ కేర్ లీవ్ వినియోగించుకునేలా 18 సంవత్సరాల వయస్సు పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం జి.ఓ నం.70 (ఆర్థిక శాఖ)ను జారీ చేయడంపై  ఏపీ ఎన్‌జీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు గణనీయమైన మేలు చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటివరకు 18 సంవత్సరాల వయస్సు పరిమితి కారణంగా రాష్ట్రంలో సుమారు 60 శాతానికి పైగా మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్ ప్రయోజనాన్ని పూర్తిగా పొందలేకపోయారని విద్యాసాగర్ గుర్తు చేశారు. ఈ పరిమితి తొలగింపుతో మహిళా ఉద్యోగులకు ఉద్యోగ–కుటుంబ బాధ్యతల సమతుల్యత సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చైల్డ్ కేర్ లీవ్‌పై వయస్సు పరిమితి తొలగించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్‌ను రాష్ట్రంలోనూ అమలు చేయాలని ఏపీ ఎన్‌జీజీఓ గతంలో పలు మార్లు విజ్ఞప్తులు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా విద్యాసాగర్ గుర్తు చేశారు.

మహిళా ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ప్రభుత్వానికి ఏపీ ఎన్‌జీజీఓ, ఏపీ జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం మహిళా ఉద్యోగుల సంక్షేమానికి దోహదపడే చారిత్రాత్మక అడుగుగా నిలుస్తుందని విద్యాసాగర్ పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News

చైల్డ్ కేర్ లీవ్ సడలింపుపై ఏపీ జేఏసీ అమరావతి హర్షం చైల్డ్ కేర్ లీవ్ సడలింపుపై ఏపీ జేఏసీ అమరావతి హర్షం
అమరావతి(జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మహిళా ఉద్యోగినులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల వయస్సుతో సంబంధం లేకుండా, మహిళా ఉద్యోగులు తమ సర్వీస్...
గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలి.
చైల్డ్ కేర్ లీవ్‌పై వయస్సు పరిమితి తొలగింపు అభినందనీయం :ఎన్‌జీజీఓ
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో కొత్త విధానం 
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 8వ మహాసభలు విజయవంతం
మెకానికల్ లు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి