హైదరాబాద్‌లో దారుణం: గంజాయి మత్తులో వాచ్‌మెన్ హత్య

సర్దార్‌పటేల్‌నగర్‌లో కలకలం – ఇనుపరాడ్డుతో గుండెల్లో పొడిచి మృతికి గురిచేసిన ముఠా

హైదరాబాద్‌లో దారుణం: గంజాయి మత్తులో వాచ్‌మెన్ హత్య

హైదరాబాద్ ( జర్నలిస్ట్ ఫైల్ ) : నగరంలోని కెపిహెచ్‌బి కాలనీలో ఆదివారం అర్థరాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. సర్దార్‌పటేల్‌నగర్‌లో గల ఓ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌ను గంజాయి మత్తులో ఉన్న ముఠా సభ్యులు ఇనుపరాడ్డుతో పొడిచి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు వెంకటరమణ (వయస్సు 45) ఆ ప్రాంతంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.

అర్థరాత్రి సమయంలో అతని అపార్ట్‌మెంట్ సమీపంలోని పార్కులో గంజాయి సేవిస్తూ గందరగోళం సృష్టిస్తున్న ముఠా సభ్యులను వెంకటరమణ మందలించాడు. దీనిపై ఆగ్రహించిన నలుగురు యువకులు అతనిపై ఇనుపరాడ్డుతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే వెంకటరమణ మరణించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, హత్యకు పాల్పడిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

పోలీసులు ఎవరైనా సమాచారం అందిస్తే 100కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని