బృందావన్ ధామ్‌లో కోహ్లీ దంపతులు – ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు
టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత తొలి ప్రజా కార్యక్రమంలో కోహ్లీ
On
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే తన తొలి వ్యక్తిగత కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ ధామ్‌కు భార్య అనుష్క శర్మతో కలిసి వెళ్లిన కోహ్లీ, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా గురువు వారికి ఆధ్యాత్మిక బోధనలు చేశారు. కోహ్లీ-అనుష్క దంపతుల బృందావన్ ధామ్ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గతంలోనూ కోహ్లీ ఇక్కడికి పలు మార్లు వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, 2011లో వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ... తన 13 ఏళ్ల టెస్టు కెరీర్‌లో 113 మ్యాచ్‌లు ఆడి, 9,230 పరుగులు సాధించారు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
Tags: Team India Virat Kohli Retirement Kohli Test Career Anushka Sharma Premanand Maharaj Brindavan Dham Kohli Spiritual Visit Kohli Anushka Temple Visit Indian Cricket News Virat Kohli Career Stats Kohli Brindavan Photos Kohli Viral Videos Cricket Retirement News Indian Celebrities Spiritual India
About The Author
Related Posts
Latest News
05 Jul 2025 21:24:41
ప్రత్తిపాడు, జూలై 5 (జర్నలిస్ట్ ఫైల్): భారతీయ జనతా పార్టీ ప్రత్తిపాడు మండలంలో విస్తృత స్థాయి సమావేశం శనివారం మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి...