వేడుకగా ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఎన్నికలు
-మూడోసారి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఘంటసాల శ్రీనివాసరావు
గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్) : ఉద్యోగ సంఘ శక్తి గర్జనగా మారి, జయహో నినాదాలతో ఎన్జీవో హోం మార్మోగిన వేళ… ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్–నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్) గుంటూరు జిల్లా శాఖ ఎన్నికలు ఆదివారం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ర్యాలీలు, సంబరాల నడుమ, ఉద్యోగ సంఘ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తూ, అన్ని 17 పదవులు ఏకగ్రీవంగా భర్తీ కావడం సంఘ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. ఈ ఎన్నికల్లో అన్ని పదవులు ఏకగ్రీవంగా భర్తీ కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అధ్యక్ష, కార్యదర్శి పదవులతో సహా మొత్తం 17 పోస్టులకు గాను 17 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు ఎన్నికల అధికారి, రాష్ట్ర సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి కే. జగదీశ్వరరావు ప్రకటించారు.
ఎన్నికలకు సహాయ అధికారిగా ఆనందనాథ్, పరిశీలకులుగా వి. సుబ్బారెడ్డిలు వ్యవహరించారు. ఈ సందర్భంగా మూడోసారి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్ష–కార్యదర్శులు కామ్రేడ్ అలపర్తి విద్యాసాగర్, కామ్రేడ్ డి.వి. రమణల నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు విశేషంగా కృషి జరుగుతోందని తెలిపారు. వారి సహాయ సహకారాలతో గుంటూరు జిల్లా శాఖను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుపుతామని పేర్కొన్నారు.
ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల అధికారులు కే. జగదీశ్వరరావు, ఆనందనాథ్, వి. సుబ్బారెడ్డిలను సంఘం తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్ ఘనంగా సన్మానించారు. గుంటూరు నగర శాఖ అధ్యక్ష–కార్యదర్శులు కామ్రేడ్ సూరి, సిహెచ్ కళ్యాణ్ కుమార్‌లు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు రమేష్, నాలుగో తరగతి ఉద్యోగ సంఘం అధ్యక్ష–కార్యదర్శులు శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు సేవా నాయక్, డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధి పాపారావు, ఇరిగేషన్ ఎన్జీవో నాయకులు, రిటైర్డ్ ఉద్యోగ సంఘ నాయకులు వెంకటేశ్వరరావు, పి. నాగరాజు, హాస్టల్ వెల్ఫేర్ సంఘం నాయకులు, గుంటూరు జిల్లాలోని అన్ని తాలూకా యూనిట్ల అధ్యక్ష–కార్యదర్శులు, అలాగే పల్నాడు, బాపట్ల జిల్లాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎన్నికల ఫలితాలు:
జిల్లా అధ్యక్షుడు – ఘంటసాల శ్రీనివాసరావు (మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్)
సహాధ్యక్షుడు – సిహెచ్ రాంబాబు (రిజిస్ట్రేషన్ శాఖ)
ఉపాధ్యక్షులు – డి.డి. నాయక్ (మెడికల్, తుళ్లూరు), కె.వి.వి. కిషోర్ (ఆర్ అండ్ బి, తెనాలి), జి.సి.హెచ్ కోటేశ్వరరావు (వెటర్నరీ, మంగళగిరి), డి. దుర్గారావు (వార్డు సచివాలయ శాఖ, పలకలూరు), సిహెచ్ అనిల్ కుమార్ (పశుసంవర్ధక శాఖ)
మహిళా ఉపాధ్యక్షురాలు – వి. శ్రీవాణి (వైద్య ఆరోగ్య శాఖ, పొన్నూరు)
జిల్లా కార్యదర్శి – ఏ. శ్యామసుందర్ శ్రీనివాస్ (వ్యవసాయ శాఖ)
కార్యనిర్వాహక కార్యదర్శి – కే.ఎన్. సుకుమార్ (పీహెచ్‌సీ, పెద్దకాకాని)
సంయుక్త కార్యదర్శులు – సయ్యద్ జానీబాషా (వాణిజ్య పన్నుల శాఖ), కే. విజయబాబు (పబ్లిక్ హెల్త్), డి. శ్రీనివాస్ (ఖజానా శాఖ), కే. నరసింహారావు (జల వనరులు శాఖ)
మహిళా సంయుక్త కార్యదర్శి – ఎం. విజయలక్ష్మి (సాధారణ భీమా శాఖ)
కోశాధికారి – ఎల్. శ్రీధర్ రెడ్డి (వైద్య ఆరోగ్య శాఖ)
ఉద్యోగుల ఐక్యతే బలమని మరోసారి నిరూపిస్తూ జరిగిన ఈ ఎన్నికలు గుంటూరు జిల్లా ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌కు నూతన జోష్‌ను అందించాయి. అనుభవం, విశ్వాసంతో కూడిన నాయకత్వం పగ్గాలు చేపట్టడంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మరింత పోరాట స్ఫూర్తితో ముందుకు సాగనున్నామని నేతలు స్పష్టం చేశారు. సంబరాలు, నినాదాల నడుమ ముగిసిన ఈ ఎన్నికలు జిల్లా సంఘ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఘట్టంగా నిలిచాయి.

