ఏపీ ఎస్ఆర్ఎంలో వేడుకగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
- కోలాహలంగా మారిన విశ్వవిద్యాలయ ప్రాంగణం
అమరావతి(జర్నలిస్ట్ ఫైల్) : ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గురువారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 300 మందికి పైగా పూర్వ విద్యార్థులు సమావేశానికి హాజరు కావడంతో వర్సిటీ ప్రాంగణం కోలాహలంగా మారింది. ఉత్సాహభరిత వాతావరణంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య సీహెచ్ సతీష్ కుమార్ సమ్మేళనాన్ని ప్రారంభించారు. జాతి ప్రయోజనాలను కాంక్షిస్తూ దేశ, రాష్ట్ర పురోభివృద్ధికి దోహదపడాలని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సతీష్ విద్యార్థులకు సూచించారు. జ్ఞాపకాల దొంతరలను నెమరు వేసుకుని ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టే కార్యక్రమంగా సమ్మేళనాన్ని అభివర్ణించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. కళలు, క్రీడలు, సాంస్కృతిక ప్రదర్శనల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఆవార్డులు. బహుమతులను అందజేశారు. నూతన అంకుర సంస్థలను స్థాపించి పారిశ్రామిక రంగలో కృషి చేస్తున్న పేయలి ఇంద్ర కిరణ్ కుమార్, కొమ్మినేని గీతికలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు లభించాయి. రవితేజరెడ్డి. వి ప్రణవిలకు అంకుర సంస్థల పురస్కారాలు లభించాయి. ఉత్తమ ఫ్యాకల్టీలుగా ఎంపికైన డాక్టర్ గంగిరెడ్డి, డాక్టర్ బనిచందన్స్, డాక్టర్ మణికందన్, డాక్టర్ ప్రధాని బసులకు ఆవార్డులను ప్రకటించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ ప్రేమ్ కుమార్, డీన్ డాక్టర్ విష్ణుపథ్, స్టూడెంట్స్ అఫైర్స్ డైరెక్టర్ మేజర్ గురు ప్రీత్ సింగ్ నారంగ్, పూర్వవిద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ ఇంద్రకరణ్ పాల్గొన్నారు.
.jpeg)

