నేడు ... బీసీ, ఓసీ, మైనార్టీ ఉద్యోగుల సుధీర్ఘ పోరాటం ఫలించే రోజు !
హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పులు స్పష్టంగా ఉన్నప్పటికీ వాటి అమలును అడ్డుకుంటున్న కారణంగా పదోన్నతుల విషయంలో న్యాయం జరగకపోవడంతో, మెరిట్‌లో ఉన్న అనేక మంది బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగులు దశాబ్దాల సీనియారిటీ ఉన్నప్పటికీ చిన్న పోస్టుల్లోనే ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తోంది. మరికొందరు జూనియర్లు తక్కువ వయసులోనే పదోన్నతులు పొందడం, 15–20 ఏళ్లుగా ఉన్నత హోదాల్లో కొనసాగడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని సృష్టిస్తోంది. కేడర్‌వైజ్ డేటా లేకుండా రిజర్వేషన్లు అమలు చేయరాదు, కాన్సిక్వైంటల్ సీనియార్టీని నిరవధికంగా కొనసాగించరాదు, కోటా మించిన ప్రమోషన్లలో మెరిట్ ఆధారంగా పదోన్నతులు ఇవ్వాలని కోర్టులు ప్రత్యేకంగా చెప్పాయి. కానీ ఓ వర్గం పైరవీలతో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్ పోస్టుల్లో SC/ST కోటా 2–3 రెట్లు మించిపోయిందని, మెరిట్‌లో ఉన్న 80 శాతం బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగులు చిన్న పోస్టుల్లోనే రిటైర్ అవుతున్నారు. తక్కువ వయసులో పదోన్నతులు పొందిన కొంతమంది జూనియర్లు దీర్ఘకాలం ఉన్నత హోదాల్లో కొనసాగడం శాతం బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగుల ఆత్మగౌరవానికి ఘాతుకరంగా మారుతోంది.
తెలంగాణలో సచివాలయ సంఘం బలంగా వ్యవహరించడంతో కోర్టు తీర్పులు అమలై సమస్య పరిష్కారం పొందింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అదే తీర్పులను పక్కన పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నందుకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు SC/ST రిజర్వేషన్లకు వ్యతిరేకం కావడం లేదని, కేవలం కోటా మించి ఇచ్చిన అక్రమ ప్రమోషన్లను మాత్రమే కోర్టు ఆదేశాల ప్రకారం పునఃసమీక్షించాలంటున్నాయి.
నేటి సచివాలయ సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు. ఇవి బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగుల భవిష్యత్తు, ఆత్మగౌరవం కోసం జరిగే ధర్మపోరాటం అని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. సంవత్సరాలుగా పదోన్నతుల కోసం నిస్వార్థంగా పోరాడిన నాయకత్వానికి ఈ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని, ఉద్యోగుల హక్కులను రక్షించడానికి బలమైన సంఘాన్ని ఏర్పరచుకోవాలని ఉద్యోగ వర్గాలు పిలుపునిస్తున్నారు.
బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగులందరూ ఒకే వేదికపై నిలిచి తమ ఓటుతో భవిష్యత్తును నిర్ణయించుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. మన ఓటే మన భవిష్యత్తు అని , బీసీ–ఓసీ–మైనారిటీ ఉద్యోగుల పదోన్నతుల కోసం ఏళ్ళ తరబడి పోరాటం చేస్తున్న కోట్ల రాజేష్, నాపా ప్రసాద్ ప్యానలుకు మద్దతుగా ఈ ఎన్నికల్లో చైతన్యవంతమైన నిర్ణయం తీసుకోవాలని వారు ఆకాంక్షిస్తున్నారు.

