బృందావన్ ధామ్‌లో కోహ్లీ దంపతులు – ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు

టెస్ట్‌ క్రికెట్‌ రిటైర్మెంట్‌ తర్వాత తొలి ప్రజా కార్యక్రమంలో కోహ్లీ

బృందావన్ ధామ్‌లో కోహ్లీ దంపతులు – ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు

 టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన వెంటనే తన తొలి వ్యక్తిగత కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌ ధామ్‌కు భార్య అనుష్క శర్మతో కలిసి వెళ్లిన కోహ్లీ, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా గురువు వారికి ఆధ్యాత్మిక బోధనలు చేశారు. కోహ్లీ-అనుష్క దంపతుల బృందావన్‌ ధామ్‌ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. గతంలోనూ కోహ్లీ ఇక్కడికి పలు మార్లు వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, 2011లో వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేసిన విరాట్‌ కోహ్లీ... తన 13 ఏళ్ల టెస్టు కెరీర్‌లో 113 మ్యాచ్‌లు ఆడి, 9,230 పరుగులు సాధించారు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

About The Author

Related Posts

Latest News

 చైల్డ్ కేర్ లీవ్‌పై వయోపరిమితి తొలగింపు – ఎన్జీజీఓ మహిళా ఉద్యోగుల కృతజ్ఞతలు  చైల్డ్ కేర్ లీవ్‌పై వయోపరిమితి తొలగింపు – ఎన్జీజీఓ మహిళా ఉద్యోగుల కృతజ్ఞతలు
విజయవాడ(జర్నలిస్ట్ ఫైల్)  మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్‌పై ఉన్న వయోపరిమితిని పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, గుంటూరు జిల్లా మహిళా...
మహిళా క్రికెటర్ శ్రీచరణికి నగదు ప్రోత్సాహకం అందజేత
చైల్డ్ కేర్ లీవ్ సడలింపుపై ఏపీ జేఏసీ అమరావతి హర్షం
గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలి.
చైల్డ్ కేర్ లీవ్‌పై వయస్సు పరిమితి తొలగింపు అభినందనీయం :ఎన్‌జీజీఓ
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో కొత్త విధానం 
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి