డబ్ల్యూటీసీ ఫైనల్ 2025: ఆసీస్ జట్టు ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా
గాయాల నుంచి కోలుకొని తిరిగొచ్చిన ప్యాట్ కమిన్స్, కామెరాన్ గ్రీన్, హాజిల్‌వుడ్
మెల్బోర్న్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ – 2025 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం తమ తుది జట్టును ప్రకటించింది. లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాతో తలపడనున్న ఈ మెగా ఫైనల్‌కు ఆసీస్ 15 మందితో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది.
డబ్ల్యూటీసీ లీగ్ దశలో దక్షిణాఫ్రికా 12 టెస్టుల్లో 8 విజయాలతో 69.44 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా 19 టెస్టుల్లో 13 విజయాలతో 67.54 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి.
గాయం కారణంగా శ్రీలంక టూర్ మిస్ అయిన పేసర్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మళ్లీ జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. వెన్నునొప్పికి శస్త్రచికిత్స తర్వాత విశ్రాంతి తీసుకున్న ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్, పేసర్ జోష్ హాజిల్‌వుడ్ కూడా ఫిట్‌గా తిరిగొచ్చారు. స్పిన్నర్ మాట్ కుహ్నెమన్‌కు చోటు దక్కింది.
డబ్ల్యూటీసీ ఫైనల్-2025కు ఆస్ట్రేలియా జట్టు ఇలా:
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాస్, మాట్ కుహ్నెమన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.
ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డాగెట్.