సత్యరాజ్ ప్రధాన పాత్రలో ‘త్రిబాణధారి బార్బరిక్’ – విడుదలకు సిద్ధం

సత్యరాజ్ ప్రధాన పాత్రలో ‘త్రిబాణధారి బార్బరిక్’ – విడుదలకు సిద్ధం

సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మించిన ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ‘‘అనగా అనగా కథలా’’ అనే పాటలో సత్యరాజ్ ఎమోషనల్ ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇటీవల చిత్రాన్ని వీక్షించిన యూనిట్ బాగా ఖుషీగా ఉందని తెలుస్తోంది. అవుట్‌పుట్‌పై మంచి నమ్మకంతో చిత్ర బృందం ముందుకు సాగుతోంది. ముఖ్యంగా సత్యరాజ్ సినిమా కంటెంట్‌పై ఉన్న విశ్వాసంతో ప్రమోషన్లలో ఎనర్జీగా పాల్గొంటుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ సినిమాలో సత్యరాజ్‌తో పాటు సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా ఉదయ భాను నెగటివ్ షేడ్‌ ఉన్న పాత్రలో దర్శనం ఇవ్వనుండటంతో సినిమాకు అదనపు ఆసక్తి చేరనుంది.

ప్రస్తుతం ఓ మంచి విడుదల తేదీ కోసం చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.


About The Author

Related Posts

Latest News

ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం
ప్రత్తిపాడు, జూలై 5 (జర్నలిస్ట్ ఫైల్): భారతీయ జనతా పార్టీ ప్రత్తిపాడు మండలంలో విస్తృత స్థాయి సమావేశం శనివారం మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి...
ఆపరేషన్ సిందూర్: బాజీరావు విగ్రహావిష్కరణలో మోడీ ప్రభుత్వం చారిత్రక సంకల్పానికి అమిత్ షా ఘనప్రశంస
అవయవ దాన ప్రచారానికి అంకితమైన సేవలకు కేంద్ర పురస్కారం – నాగార్జున చేతుల మీదుగా నరసింహారెడ్డికి గౌరవం
రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ 
గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్ రెడ్డిది
మైదుకూరులో "రీ కాల్ చంద్రబాబు" సభకు భారీ స్పందన
వంశీని పరామర్శించిన కొడాలి, పేర్ని – తెలప్రోలులో ముగ్గురు నేతల సన్నిహిత సమావేశం