టెన్త్ సిబిఎస్ఇ సిలబస్ లో...వివేకానంద సెట్రల్ స్కూల్ విజయకేతనం
తెనాలి,(జర్నలిస్ట్ ఫైల్) : సీబీఎస్ఇ సిలబస్ ద్వారా జాతీయస్థాయిలో జరిగిన టెన్త్,ఇంటర్ పరీక్షల్లో వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు విజయ కేతనం ఎగురవేసి జాతీయ స్థాయి గుర్తింపు పొందారని, వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ విజేతలను ప్రశంసించారు. స్థానిక వివేకానంద సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిబిఎస్ఇ సిలబస్ ద్వారా నిర్వహించిన జాతీయస్థాయి పరీక్షల్లో వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించగా, ఆ వివరాలు వెల్లడించారు. టెన్త్ లో షేక్ అరీపున్నీసబేగం 500 మార్కులకు 489 మార్కులు సాధించి జాతీయ స్థాయి గుర్తింపు పొందినట్లు తెలిపారు. అదేవిధంగా జవ్వాది లిఖిత,కార్తీక్, చంద్రహాసిని 95% మార్కులు సాధించారని, బి లక్ష్మీ సుజాత, వై మనోహర్, ఏ భీమల్ రాజేంద్ర, బషీరున్నీస లు 92 శాతం మార్కులు, ఇంటర్ లో,కె. దేవికా సాయి, కొడాలి శ్రీ అంజన్న మెరిట్ మార్కులు సాధించినట్లు తెలిపారు. నూరు శాతం ఉత్తీర్ణతతో వివేకా సంస్థల విద్యార్థులు ప్రతిభను చాటుకున్నారని తెలిపారు. అనంతరం విజేతలైన విద్యార్థులకు, మెమొంటోలతో, అభినందనలతొ
ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రామరాజు, జి వెంకటరమణ, సీఈఓ ఆర్ వెంకట్రామ్, రాజేష్, శివకుమార్, మురళి, రాంబాబు, ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.