యుద్ధ సమయంలో అందాల పోటీలు అవసరమా? - సినీదర్శకుడు దిలీప్ రాజా 

యుద్ధ సమయంలో అందాల పోటీలు అవసరమా? - సినీదర్శకుడు దిలీప్ రాజా 

తెనాలి(జర్నలిస్ట్ ఫైల్) :ఉగ్రవాదం మూలాలను నాశనం చేయడమే లక్ష్యంగా ఒకవైపు మనసైనిక దళాలు రోషంతో పాకిస్థాన్ గుండెపై గురిపెట్టి యుద్ధం చేస్తుoటే మరో వైపు దేశరక్షణ కోసం భరతమాత వీరపుత్రులు ప్రాణత్యాగం చేస్తుంటే హైదరాబాద్ లో అందాలపోటీలు అవసరమా అని 'మా -ఎపి'  వ్యవస్థాపాకులు, సినీదర్శకుడు దిలీప్ రాజా నిర్వహకులను ప్రశ్నించారు.స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్,ఆంధ్ర ప్రదేశ్ 24 విభాగాల యూనియన్ కార్యాలయంలో మంగళవారo ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దిలీప్ రాజ మాట్లాడుతు ఉగ్రవాదo ఊపిరిపై దాడిచేసి యుద్ధంలో  దేశం కోసం మరణించిన భారత సైనికుల ఆత్మలకు కనీస గౌరవం ఇవ్వడం సముచితమని  హితవు పలికారు.
ఇలాంటి అందాల అరబోతల కార్యక్రమలకు అనుమతి ఉంటే సినిమాలను సెన్సార్ చేయాల్సిన అవసరమేలేదని ఆయన వ్యాఖ్యానించారు. సినిమా తెరలపై కనిపించే బొమ్మలకు సెన్సార్ పెట్టి,ప్రత్యక్ష అందాల భామలకు అనుమతులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రపంచ సుందరి పోటీల్లోని విజేతలు సినిమా హీరోయిన్లుగా చెలామణి కావడం మినహా దేశ సంస్కృతిని కాపాడే రాయబారులని ప్రస్థావించడo పద్ధతి కాదని ఆయన తెలిపారు.సంగీత బిజిలానీ, జీనత్ అమన్, సుస్మితాసేన్,ఐశ్వర్య రాయ్, మీనాక్షి శేషాద్రి,ప్రియాంక చోప్రా, నందిని గుప్తా, శోభిత ధూళిపాళ్ల,లారదత్తా, మీనాక్షి చౌదరిలు మిస్ ఇండియా అందాలపోటీల్లో విజేతలయిన తర్వాత సినీరంగంలో హీరొయిన్లుగా చెలామణి అయ్యారని దిలీప్ రాజా వివరించారు.వస్త్రాలంకరణలో వెర్రితలలు వేస్తున్న సమాజంలో ఇంకా భారతీయ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను గౌరవిస్తున్న  మహిళామతల్లులకు ప్రణామాలు తెలిపారు.కాగా మే 31 న  హైదరాబాద్ లో జరగనున్న అందాల పోటీలపై పునరాలోచాల్సిందిగా ఆయన నిర్వాహకులను కోరారు.

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని