గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు లేజర్ ఎగ్జామ్ పరికరం వితరణ
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలో చర్మవ్యాధుల చికిత్సకు లేజర్ ఎగ్జామ్ పరికరం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు వితరణ చేయబడింది. ఈ పరికరం, చర్మవ్యాధులైన వీటిలిగో, బొల్లి మచ్చలు, తెల్ల మచ్చలు, సోరియాసిస్, జిమా వంటి సమస్యలకు అత్యాధునిక చికిత్స అందిస్తుంది. రూ. 3 లక్షల విలువైన ఈ లేజర్ ఎగ్జామ్ పరికరాన్ని జి.డి.వి.ఎల్ గుంటూరు అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజీ, వెనెరాలజీ, లెప్రసీ సంస్థ వారు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు వితరణ చేశారు.
ఈ పరికరం ద్వారా పై చర్మవ్యాధులకు సంబంధించిన చికిత్సలు పూర్తిగా ఉచితంగా అందించబడతాయి. దీనివల్ల జబ్బులతో బాధపడుతున్న వారు సులభంగా చికిత్స పొందవచ్చు.
ఈ కార్యక్రమంలో జి.జి.హెచ్. సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్.ఎ.స్.వి, గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి సుందర చారి, చర్మవ్యాధుల విభాగపు అధిపతి డాక్టర్ మోహన్ రావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శ్రీధర్, వైద్య సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఈ పరికరం ద్వారా అందిన సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.