గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు లేజర్ ఎగ్జామ్ పరికరం వితరణ

 గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు లేజర్ ఎగ్జామ్ పరికరం వితరణ

గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్రంలో చర్మవ్యాధుల చికిత్సకు లేజర్ ఎగ్జామ్ పరికరం గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు వితరణ చేయబడింది. ఈ పరికరం, చర్మవ్యాధులైన వీటిలిగో, బొల్లి మచ్చలు, తెల్ల మచ్చలు, సోరియాసిస్, జిమా వంటి సమస్యలకు అత్యాధునిక చికిత్స అందిస్తుంది. రూ. 3 లక్షల విలువైన ఈ లేజర్ ఎగ్జామ్ పరికరాన్ని జి.డి.వి.ఎల్ గుంటూరు అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజీ, వెనెరాలజీ, లెప్రసీ సంస్థ వారు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు వితరణ చేశారు.

ఈ పరికరం ద్వారా పై చర్మవ్యాధులకు సంబంధించిన చికిత్సలు పూర్తిగా ఉచితంగా అందించబడతాయి. దీనివల్ల జబ్బులతో బాధపడుతున్న వారు సులభంగా చికిత్స పొందవచ్చు.

ఈ కార్యక్రమంలో జి.జి.హెచ్. సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్.ఎ.స్.వి,  గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి సుందర చారి, చర్మవ్యాధుల విభాగపు అధిపతి డాక్టర్ మోహన్ రావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శ్రీధర్, వైద్య సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఈ పరికరం ద్వారా అందిన సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

 

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని