చినకాకానిలో రూ. 5,07,296 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో లబ్ధిదారుని ఇంటికి వెళ్లి చెక్కు అందజేసిన నాయకులు

చినకాకానిలో రూ. 5,07,296 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

 మంగళగిరి మండలం చినకాకాని గ్రామానికి చెందిన మల్లవరుపు స్వరూపరాణి అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందారు. ఆమె కుటుంబ ఆర్థిక ఇబ్బందులను ఆ గ్రామానికి  చెందిన టీడీపీ నాయకులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళారు. వెంటనే స్పందించిన ఆయన సీఎం సహాయనిధి నుంచి రూ. 5,07296 /- లక్షలు మంజూరు చేయించారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో సోమవారం టీడీపీ నాయకులు లబ్ధిదారుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలిచేది ముఖ్యమంత్రి సహాయనిధి అని, దీని ద్వారా ఎన్నో కు టుంబాలు సహాయం పొందుతున్నాయని అన్నారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ వైద్యం చేయించుకోలేని నిరుపేద‌లు సీఎంఆర్ఎఫ్ ప‌థకాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి,  గ్రామ పార్టీ అధ్యక్షులు గుమ్మా హరిబాబు, బొర్రా కిరణ్ కుమార్, పలగాని గంగాధర్ రావు, మల్లవరపు కోటేశ్వరావు, కుక్క మల్ల శ్రీనివాసరావు, మల్లవరుపు సుమంత్, చాగర్లమూడి నరేంద్ర, ఈపూరి మరియదాసు, గడ్డిపాటి గౌతమ్, మల్లవరపు చిన్నబాబు, పలగాని నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని