ఖాజీల సమస్యల పరిష్కారానికి కృషి  : ఎమ్మెల్యే నసీర్

రాష్ట్రస్థాయి ఖాజీల అసోసియేషన్ విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే

ఖాజీల సమస్యల పరిష్కారానికి కృషి  : ఎమ్మెల్యే నసీర్

 గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో ఖాజీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గురువారం గుంటూరు ఆంధ్ర ముస్లిం కళాశాలలో రాష్ట్ర ఖాజీల విస్తృత సమావేశం నిర్వహించారు. ఏపీ మైనారిటీ వ్యవహారాల సలహాదారులు ఎస్ఎం షరీఫ్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ తో కలిసి ఎమ్మెల్యే నసీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింల వివాహ సందర్భంగా ఖాజీలు ఇచ్చే వివాహాల ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం పలు విభాగాలు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  రెడ్ జోన్, గ్రీన్ జోన్ లుగా విభజించి, ఖాజీలు లేని ప్రాంతాల్లో నూతనంగా నియామకాలను ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన చోట ప్రత్యేకంగా ఖాజీ బోర్డును కూడా ఏర్పాటు చేయడం ద్వారా ముస్లిం మైనార్టీల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు మార్గాలు సుగుమం అవుతాయని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ పై సమస్యలన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని