గుంటూరులో పాంగి రాజారావుకు ఘన స్వాగతం
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పాంగి రాజారావు తొలిసారి గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఆయనకు సాదర స్వాగతం పలికి ఘనంగా సన్మానం చేశారు.
జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాంగి రాజారావు మాట్లాడుతూ – ఎస్టీ నాయకులను గుర్తించి బీజేపీలోకి చేర్చి గిరిజన మోర్చాను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్టీలలో విజ్ఞానం, చైతన్యం ఉన్నవారిని ప్రోత్సహించడం ద్వారా పార్టీని మరింత బలపరచవచ్చన్నారు. అలాగే ఎస్టీ సమస్యలను గుర్తించి, అధికారులతో చర్చించి పరిష్కారం దిశగా మోర్చా ముందుకు రావాలని సూచించారు.
ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారపాటి తపన చౌదరి హాజరయ్యారు. బీజేపీ ఎల్లప్పుడూ ఎస్టీలకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వస్తున్న అవకాశాలను ఉపయోగించుకుని వ్యక్తిగత అభివృద్ధితో పాటు పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, జోనల్ ఇన్‌చార్జి దేవసోత్ వెంకటేశ్వర్ల నాయక్, శ్రీను నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బజరంగ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.