నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయం ఘనంగా ప్రారంభం

నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయం ఘనంగా ప్రారంభం

గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): నోబుల్ టీచర్స్ అసోసియేషన్ గుంటూరు జిల్లా శాఖ నూతన కార్యాలయం గుంటూరు నగరంలోని కలెక్టరేట్ రోడ్, అంకమ్మనగర్ 2వ లైన్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యాలయాన్ని మాజీ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు డాక్టర్ ఏ.ఎస్. రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ, నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఏర్పడిన కొద్ది కాలంలోనే అనేక ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిందని తెలిపారు. ముఖ్యంగా గత ఆరు సంవత్సరాలుగా డీఈఓ పూల్‌లో ఉన్న 1200 మంది భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు కల్పించడం, మున్సిపల్ మేనేజ్మెంట్‌లో 4400 కొత్త పోస్టులు మంజూరుకు కృషి చేయడం వంటి అంశాలు ఎన్టీఏ చురుకైన పాత్రను చూపుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఏ బలమైన సంఘంగా ఎదగాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు మాట్లాడుతూ, సంఘ నిర్మాణంలో భాగంగా కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇటీవల జరిగిన డీఎస్‌సీ-2025 ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరగడంలో ఎన్టీఏ ప్రముఖ పాత్ర వహించిందని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎన్టీఏ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో సంఘంలో చేరి దాన్ని బలోపేతం చేయాలని కోరారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను విని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తోందని, గత ప్రభుత్వం కాలంలో ఉపాధ్యాయులు మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, నూతన ప్రభుత్వం బకాయిలు చెల్లించడం ప్రారంభించిందని తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి షేక్ అబ్దుల్ ఖలీల్, జిల్లా అధ్యక్షుడు పి. సాయి విశ్వనాథ్, ప్రధాన కార్యదర్శి ఎన్. భాస్కరరావు, ఆర్థిక కార్యదర్శి ఎన్. నాగశేషు, జిల్లా ఉపాధ్యక్షురాలు జి. సుశీల మాధవి, అసోసియేట్ అధ్యక్షుడు పి. లలితబాబు, జిల్లా నాయకులు హనుమంతరావు, పి. చెంచయ్య, నగర శాఖ అధ్యక్షుడు కె. వీర రాఘవులు, ప్రధాన కార్యదర్శి టి. శ్రీనివాసరావు, ఆర్థిక కార్యదర్శి షేక్ రషీద్, నగర శాఖ నాయకులు టి. రవి, కె. వేణుగోపాల్, ఎ. హరగోపాల్, షేక్ సుభాని, పల్నాడు జిల్లా కార్యదర్శి కూరపాటి రాజా, ఆర్‌యుపీపీ జిల్లా అధ్యక్షుడు పి. సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

About The Author

Latest News