సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తెనాలిలో గ్రాండ్ ఓపెనింగ్    

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తెనాలిలో గ్రాండ్ ఓపెనింగ్    

సినీ గ్లామర్ మీనాక్షీ – రాజకీయ గ్లామర్ ఆలపాటి ఒకే వేదికపై...                                                                             

తెనాలి (జర్నలిస్ట్ ఫైల్): తెనాలి బోస్‌రోడ్‌లో నూతన కాంతుల్లా వెలిగిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభ వేడుక శుక్రవారం వైభవంగా సాగింది. ఓల్డ్ వీనస్ థియేటర్ ప్రాంగణంలో అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ ఆధునిక భవన సముదాయం, వస్త్రాభిమానులకు పండుగవాతావరణాన్ని తలపించింది. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తున్న ఈ బ్రాండ్, తన 37వ షోరూమ్‌ను తెనాలిలో ప్రారంభించడంతో నగరం మొత్తం ఉత్సాహభరితంగా మారింది.

సినీ–రాజకీయ గ్లామర్‌తో గ్రాండ్ ఓపెనింగ్
ఓవైపు నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న సినీగ్లామర్ మీనాక్షీ చౌదరి, మరోవైపు డెల్టా రాజకీయాలకు శోభనిచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రత్యేక అతిథులుగా హాజరై జ్యోతిప్రజ్వలనతో భారీ సందడి మధ్య షోరూమ్‌ను ఆవిష్కరించారు. ఉదయం నుంచే యాంకర్ల హల్‌చల్‌, అభిమానుల కేరింతలు, ఫోటోషూట్‌లతో ప్రాంగణం సందడిగా మారింది.

“ఆంద్రా ప్యారీస్‌లో 37వ అడుగు… తెనాలి గర్వం!” – ఎమ్మెల్సీ ఆలపాటి

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి మాట్లాడుతూ, “దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మన తెనాలిలో ‘ఆంద్రా ప్యారీస్’కు తగిన ప్రతిష్టతో 37వ షోరూమ్‌ను ప్రారంభించడం శుభ సూచకం. ముఖ్యంగా ఈ సంస్థ భాగస్వాములు మన తెనాలి, పరిసర గ్రామాలకు చెందినవారే కావడం ఆనందదాయకం. నాణ్యతకు, నవ్యతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు నిజాయితీ గల సేవలు అందించాలని ఆశిస్తున్నాను” అన్నారు.

“సంక్రాంతికి థియేటర్‌లో కలుద్దాం!” – మీనాక్షీ చౌదరి

సినీనటి మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ, “సౌత్ ఇండియాషాపింగ్ మాల్ ఎక్కడైనా నూతన అనుభూతి, నమ్మకమైన సేవలు అందించే షాపింగ్ గమ్యం. తెనాలి ప్రజలు తమ బడ్జెట్‌కి సరిపడే ఉత్తమ వస్త్రాల కోసం తప్పకుండా ఈ షోరూమ్‌ను వినియోగించుకోవాలి. సంక్రాంతికి నా కొత్త చిత్రంతో మీ ముందుకు వస్తాను… థియేటర్‌లో కలుద్దాం!” అని తెలిపారు.

 “మళ్లీ తెనాలితో వస్త్ర బంధం!” – నిర్వాహకులు

సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, “మన కుటుంబ వస్త్ర వ్యాపారం ఆరంభమైన నేల తెనాలే. మూడవ తరం ప్రయాణంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 37వ షోరూమ్‌ను ఇక్కడ తిరిగి ప్రారంభించడం గర్వకారణం. సంప్రదాయ సిల్క్ నుంచి తాజా ఫ్యాషన్‌వేర్ వరకు కుటుంబమంతా కొనుగోలు చేయగల ప్రత్యేక కలెక్షన్లు సిద్ధం చేశాం” అని వెల్లడించారు.


చైర్‌పర్సన్ పొట్టి వెంకటేశ్వర్లు, ఎండీ సీర్ణ రాజమౌళి, డైరెక్టర్ తిరువీదుల ప్రసాదరావు, డబుల్ హార్స్ చైర్మన్ మునగాల శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో వస్త్ర వైభవానికి కొత్త అధ్యాయాన్ని తెరిచిన ఈ గ్రాండ్ ఓపెనింగ్ నగర ప్రజల్లో పండుగ సందడి నింపింది.

Tags:

About The Author

Related Posts

Latest News

యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 8వ మహాసభలు విజయవంతం యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 8వ మహాసభలు విజయవంతం
విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 8వ మహాసభలు మంగళవారం విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా...
మెకానికల్ లు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి
స్వర్ణాంధ్ర సాధన లో నూతన జాతీయ విద్యా విధానం ప్రముఖ పాత్ర
ఘనంగా టీడీపీ నేత పోతినేని జన్మదిన వేడుకలు
ఎస్ఆర్ఎం వర్సిటీకి క్యూ ఎస్ఐ - గేజ్ హ్యాపీనెస్ అవార్డు.
 మంగళగిరి డాన్ బోస్కో స్కూల్ పుస్తకావిష్కరణ
డాన్ బాస్కో అంటే ప్రేమ, సేవ