ఘనంగా టీడీపీ నేత పోతినేని జన్మదిన వేడుకలు

ఘనంగా టీడీపీ నేత పోతినేని జన్మదిన వేడుకలు

మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్): తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు జన్మదినోత్సవ వేడుకలు ఆదివారం మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు మాజీ కౌన్సిలర్, టిడిపి నాయకులు రంగిశెట్టి నరేంద్ర, షేక్ ఇంతియాజ్  ఆధ్వర్యంలో  పోతినేనికి శాలువా కప్పి భారీ పొదినాకు దండ వేసి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోతినేని శ్రీనివాసరావు ఇటువంటి జన్మ దినోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ప్రజల ఆశీస్సులు, భగవంతుని దీవెనలతో నిండు నూరేళ్లు  ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నట్లు  తెలిపారు. రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో పోతిన శ్రీనివాసరావు చేసిన సేవా కార్యక్రమాలను, టిడిపి అభివృద్ధి చేస్తున్న కృషిని వారు ప్రశంసించారు.  పోతినేని శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ రంగిశెట్టి నరేంద్ర తమ సొంత ఖర్చులతో తెనాలి రోడ్డు వద్ద గల ముక్తినాథ్ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. 

ఆయా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొత్తపల్లి శ్రీనివాసరావు,  సుఖమంచి గిరిబాబు, ఆళ్ల శ్రీనివాసరావు, తిరుమల శెట్టి మురళీకృష్ణ, వెంకటేశ్వరరావు, రాఘవరపు శ్రీనివాసరావు, మల్లాది శ్రీనివాసరావు, షేక్ సుభాని, షేక్ మౌలాఖాన్, ఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.  టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ ఆధ్వర్యంలో పోతినే శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పోతినేని ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  షేక్ ఖాదర్ వలీ, గుంటూరు పార్లమెంటు మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ నాగుల్ మీరా, మంగళగిరి నియోజకవర్గం మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు షేక్ సుభాని, పట్టణ మైనార్టీ అధ్యక్షులు షేక్ చిన నాగుల్ మీరా, పట్టణ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు పఠాన్ అబ్దుల్లా ఖాన్, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు. 

పీఎస్ఆర్ భవన్ లో...

మంగళగిరి పట్టణంలోని ఆయన నివాసంలో  మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్   మర్యాదపూర్వకంగా కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసారు.టీడీపీ నాయకులు  మాదల రమేష్ బాబు, యేళ్ళ శివరామయ్య, జాలాది సందీప్, బొర్రా శ్రీకాంత్, కొండూరు నరేంద్ర , మొగల్ లాలా బేగ్ తదితరులు పాల్గొన్నారు.

చర్చిలో ప్రార్థనలు...

మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ వద్ద బైపాస్ రోడ్ వెంబడి ఉన్న బేతస్థ ప్రార్థనా మందిరంలో ఆదివారం టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ సీనియర్ నాయకులు గోవాడ దుర్గారావు, టీడీపీ నియోజకవర్గ అంగన్వాడీల కార్యనిర్వాహణ కార్యదర్శి గోవాడ వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో పోతినేని పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండీ ఇబ్రహీం, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివ శేషగిరిరావు, టీడీపీ కృష్ణ బలిజ రాష్ట్ర సాధికార సమితి సభ్యులు అన్నం నాగబాబు హాజరయ్యారు. పాస్టర్ ఎన్ విజయ్ రాజు కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. నియోజకవర్గంలో పోతినేని పార్టీ అభివృద్ధికి, సార్వత్రిక ఎన్నికలలో మంత్రి నారా లోకేష్ విజయానికి ఎంతో కృషి చేశారన్నారు. యేసయ్య చల్లని దీవెనలు పోతినేని పై ఉండి సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఉన్నత పదవిని కల్పించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గోవాడ రవి, టీడీపీ నాయకులు వాకా మాధవరావు గౌడ్, గోసాల రాఘవ, కొదమల సైమన్, చింతా వెంకటేశ్వరరావు, షేక్ సుభాని, జమ్ముల శ్రీనివాసరావు, మునగపాటి ప్రసన్న వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


 ఆయన నివాసంలో ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల హరిదాసు మర్యాదపూర్వకంగా కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పోతినేని శ్రీనివాసరావు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండి, ప్రజాసేవలో నిరంతరం నిబద్ధతతో పనిచేస్తున్న పోతినేని శ్రీనివాసరావు మరింత ముందుకు సాగుతూ, ఉన్నత పదవులు అధిరోహించాలని బత్తుల హరిదాసు ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఆనంద్ కృష్ణ, నరేష్, రత్నబాబు తదితరులు ఉన్నారు.

ఏంఏంకే స్టేడియంలో...

 ఎంఎంకె స్టేడియం ఆవరణలో ఆదివారం తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి, స్టేడియం డోనర్ పోతినేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను స్టేడియం ఎగ్జిక్యూటివ్ మెంబర్ పోతినేని మోహనరావు కట్ చేశారు. అనంతరం పలువురు స్టేడియం ప్రతినిధులు, టీడీపీ నాయకులు మాట్లాడారు. టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శిగా పోతినేని పార్టీ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, నియోజకవర్గంలో కూడా పార్టీ అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. స్టేడియం అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు అందిస్తూ క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆయన ఉన్నత పదవులను పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్టేడియం ఇన్చార్జి కొత్తపల్లి శ్రీనివాసరావు, స్టేడియం ప్రతినిధులు, టీడీపీ నాయకులు డాక్టర్ టీ రాఘవ, డాక్టర్ తుంగల శ్రీనివాసరావు, మాచర్ల శ్రీనివాసరావు, వల్లూరి రామకోటేశ్వరరావు, నల్గొండ మల్లికార్జునరావు, కాటూరి రాము, వుడతా శ్రీనివాసరావు, తిరుమల శెట్టి మురళీకృష్ణ, మేడూరి బ్రహ్మాజీ, దోనే బుజ్జి, ఎస్కే  సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags:

About The Author

Latest News

యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 8వ మహాసభలు విజయవంతం యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 8వ మహాసభలు విజయవంతం
విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 8వ మహాసభలు మంగళవారం విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా...
మెకానికల్ లు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి
స్వర్ణాంధ్ర సాధన లో నూతన జాతీయ విద్యా విధానం ప్రముఖ పాత్ర
ఘనంగా టీడీపీ నేత పోతినేని జన్మదిన వేడుకలు
ఎస్ఆర్ఎం వర్సిటీకి క్యూ ఎస్ఐ - గేజ్ హ్యాపీనెస్ అవార్డు.
 మంగళగిరి డాన్ బోస్కో స్కూల్ పుస్తకావిష్కరణ
డాన్ బాస్కో అంటే ప్రేమ, సేవ