మెకానికల్ లు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి

మెకానికల్ లు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి

ఆటోనగర్లో స్కిల్ కమ్యూనికేషన్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం
మెకానికులకు అండగా నిలుస్తాం
గుంటూరు మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమంలో
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్


గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మెకానిక్ లకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని, ఆటోనగర్లో స్కిల్ కమ్యూనికేషన్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనార్టీస్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. గుంటూరు టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో నిర్వహించిన 21వ వార్షికోత్సవ కార్యక్రమానికి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు చుక్కపల్లి రమేష్ తో కలిసి ఎమ్మెల్యే నసీర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాహనాలైనా, యంత్రాలైనా తయారు చేసిన తర్వాత మెకానిక్ ల అవసరం తప్పనిసరి అని పేర్కొన్నారు మెకానిక్ లు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ వృత్తిలో పట్టు సాధించాలని సూచించారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలలో స్కిల్ కమ్యూనికేషన్స్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొన్ని రోజుల క్రితం కోయంబత్తూర్ లో పర్యటించానని,, అక్కడ అత్యంత పొడవైన బ్రిడ్జికి ఒక మెకానిక్ పేరు పెట్టారని ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే నసీర్ వివరించారు. యంత్రం తయారయ్యాక మెకానిక్ ల పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుందని, దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మెకానిక్ ల కోసం ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో గుంటూరు టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 8వ మహాసభలు విజయవంతం యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 8వ మహాసభలు విజయవంతం
విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 8వ మహాసభలు మంగళవారం విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా...
మెకానికల్ లు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి
స్వర్ణాంధ్ర సాధన లో నూతన జాతీయ విద్యా విధానం ప్రముఖ పాత్ర
ఘనంగా టీడీపీ నేత పోతినేని జన్మదిన వేడుకలు
ఎస్ఆర్ఎం వర్సిటీకి క్యూ ఎస్ఐ - గేజ్ హ్యాపీనెస్ అవార్డు.
 మంగళగిరి డాన్ బోస్కో స్కూల్ పుస్తకావిష్కరణ
డాన్ బాస్కో అంటే ప్రేమ, సేవ