లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

కార్మిక చట్టాలను యధాతధంగా అమలు చేయాలి
విజయవాడలో ఏపీఎంఎస్ఆర్‌యూ రాష్ట్రవ్యాప్త ధర్నా

విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : లేబర్ కోడ్స్‌ను పూర్తిగా రద్దు చేసి, కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను యధాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రెప్రెసెంటేటివ్స్ యూనియన్ (ఏపీఎంఎస్ఆర్‌యూ) ఆధ్వర్యంలో రెండురోజుల రాష్ట్రవ్యాప్త ధర్నా విజయవాడ ధర్నా చౌక్ సెంటర్‌లో నిర్వహించారు.

ఈ ధర్నా శిబిరాన్ని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఏవి నాగేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు. కార్మిక వర్గం ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులు, చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్స్‌ను పూర్తిగా రద్దు చేయాలని, కార్మిక చట్టాలను యధాతధంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే కేరళ రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్‌ను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రకటించిందని గుర్తుచేసిన ఆయన, ఆంధ్రప్రదేశ్‌లో కూడా కూటమి ప్రభుత్వం అదే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఏపీఎంఎస్ఆర్‌యూ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ చట్టం–1976ను సేల్స్ రెప్రెసెంటేటివ్స్ దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగించిన పోరాటాలతో సాధించుకున్నామని తెలిపారు. లేబర్ కోడ్స్ వల్ల ఈ చట్టం రద్దయ్యే పరిస్థితి వస్తే, దాన్ని అడ్డుకునేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ ధర్నా శిబిరానికి సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు దయా రమాదేవి, పౌరహక్కుల సంక్షేమ సంఘం నాయకులు పున్నారావు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రాజు, ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం నాయకులు కళాధర్ హాజరై సంఘీభావం ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ఆర్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రావు, సంయుక్త ప్రధాన కార్యదర్శి యు.ఎస్.రవికుమార్, కోశాధికారి డి.ప్రసాద్, ఉపాధ్యక్షులు యువి కృష్ణయ్య, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 500 మందికి పైగా మెడికల్ అండ్ సేల్స్ రెప్రెసెంటేటివ్స్ ఈ ధర్నాలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు.

Tags:

About The Author

Latest News

లేబర్ కోడ్స్ రద్దు చేయాలి లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
కార్మిక చట్టాలను యధాతధంగా అమలు చేయాలి విజయవాడలో ఏపీఎంఎస్ఆర్‌యూ రాష్ట్రవ్యాప్త ధర్నా విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : లేబర్ కోడ్స్‌ను పూర్తిగా రద్దు చేసి, కార్మిక వర్గం...
యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 8వ మహాసభలు విజయవంతం
మెకానికల్ లు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి
స్వర్ణాంధ్ర సాధన లో నూతన జాతీయ విద్యా విధానం ప్రముఖ పాత్ర
ఘనంగా టీడీపీ నేత పోతినేని జన్మదిన వేడుకలు
ఎస్ఆర్ఎం వర్సిటీకి క్యూ ఎస్ఐ - గేజ్ హ్యాపీనెస్ అవార్డు.
 మంగళగిరి డాన్ బోస్కో స్కూల్ పుస్తకావిష్కరణ