ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
On
ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.12,015 కోట్లతో మెట్రో నెట్‌వర్క్‌ను మరింత విస్తరించనుంది. మొత్తం 16 కిలోమీటర్ల మేర కొత్త లైన్ నిర్మించనున్నారు. ఇందులో 10 అండర్‌గ్రౌండ్ స్టేషన్లు, 3 ఎలివేటెడ్ స్టేషన్లు ఉంటాయి. మూడేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణతో ఢిల్లీలోని రద్దీ ప్రాంతాలకు మెట్రో సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి. ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని కేంద్రం భావిస్తోంది.
Tags:
About The Author
Related Posts
Latest News
05 Jan 2026 20:46:00
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గొలిమి రామకృష్ణ నాయకత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఉద్యోగుల...

