2029 ఎన్నకల్లో పోటీకి సిద్ధం : జాగృతి జనం బాటలో కవిత
On
తాను తెలంగాణ ప్రజల బాణాన్ని, తనను ఎవరూ ఆపరేట్ చేయడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. భువనగిరి వివేరా హోటల్ లో మీడియాతో మాట్లాడారు. 2029 ఎన్నికల్లో తప్పకుండా బరిలో ఉంటామని ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి తనను ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటికీ కారణం చెప్పలేదని తెలిపారు. బీఆర్ఎస్లో జరిగిన తప్పులకు పార్టీలో ఉన్న సమయంలో తాను కూడా భాగస్వామినేనని అంగీకరిస్తూ, అప్పట్లో జరిగిన ప్రజా అన్యాయాలకు క్షమాపణలు చెప్పారు.
ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ లో పెద్దల భూములను కాపాడేందుకు పేదల భూములను బలిచేస్తున్నారని ఆరోపించారు. నాయకుల అవినీతి కారణంగానే ఇష్టానుసారంగా రింగ్ రోడ్ ఆలైన్మెంట్లు మారుస్తున్నారని మండిపడ్డారు. దీనిపై జాగృతి తరఫున ఆన్లైన్ ఉద్యమం చేపడతామని, జనవరి 5న హైదరాబాద్లో బాధిత రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు.
బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా ఇప్పటివరకు చుక్కనీరు కూడా రాలేదని, కెనాల్స్ పూర్తి కాలేదని విమర్శించారు. 96వేల ఎకరాల భూములు పరిహారం లేకుండా తీసుకున్నారని, కలెక్టర్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Tags:
About The Author
Related Posts
Latest News
05 Jan 2026 20:46:00
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గొలిమి రామకృష్ణ నాయకత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఉద్యోగుల...

