నెలరోజుల్లో పంచాయతీలకు నిధులివ్వాల్సిందే
On
రాబోయే నెల రోజుల్లో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలోని సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కలిసి హైదరాబాద్ లో పరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా గెలుపొందిన బీజేపీ సర్పంచ్ లను ఘనంగా సన్మానించారు.
అనంతరం మాట్లాడుతూ… నిధులను మంజూరు చేసిన తరువాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ సాకుతో నిధుల విడుదలలో జాప్యం చేస్తే కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచేందుకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ సర్పంచులను గెలిపించిన గ్రామాలను అన్ని విధాలా అభివ్రుద్ది చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
05 Jan 2026 20:46:00
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గొలిమి రామకృష్ణ నాయకత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఉద్యోగుల...

