ఎన్నికలు ఎప్పుడు జరిగిన బిఆర్ఎస్ దే అధికారం: హరీష్ రావు

ఎన్నికలు ఎప్పుడు జరిగిన బిఆర్ఎస్ దే అధికారం: హరీష్ రావు

మాజీ సిఎం కెసిఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. మెదక్ నర్సాపూర్ లో హరీష్ రావు పర్యటించారు. నర్సాపూర్ సబ్ స్టేషన్‌లో లాగ్ బుక్కులను పరిశీలిస్తే రైతులకు 12 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని తెలిసిందని అన్నారు. మీద నుండి కరెంట్ రాకపోతే వీళ్ళు మాత్రం ఏం చేస్తారని, గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలో డీజిల్ లేక మూలకు పడేశారని మండిపడ్డారు. కరెంట్ సరఫరా అవ్వడం లేదని, ట్రాక్టర్లలో డీజిల్ నింపడానికి డబ్బులు లేవని అంటే అధికారులను సస్పెండ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం నిజాయితీగా రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగిన బిఆర్ఎస్ దే అధికారమని, సిఎం రేవంత్ ఫుట్ బాల్ ఆడటం కాదు.. ప్రజలు రేవంత్ ను ఫుట్ బాల్ ఆడే రోజులు దగ్గరున్నవని జోస్యం చెప్పారు. ఫుట్ బాల్ పై ఉన్న ప్రేమ.. రైతులపై లేదని విమర్శించారు. ఏ ఊరికి వెళ్దామో చెప్పు.. దమ్ముంటే రావాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. దేవుళ్లను మోసం చేసిన రేవంత్ కు ప్రజలు ఓ లెక్కనా? అని హరీష్ రావు ప్రశ్నించారు. 

Tags:

About The Author

Related Posts

Latest News

సీఎంను కలిసిన సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడు రామకృష్ణ సీఎంను కలిసిన సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడు రామకృష్ణ
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గొలిమి రామకృష్ణ నాయకత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఉద్యోగుల...
వేడుకగా ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఎన్నికలు
బాలామృతం...రూ.1,200 కోట్ల టెండర్ల నిబంధనల్లో గోల్‌మాల్ ఆరోపణలు
ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్‌కు ఏపీ ఎన్జీజీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల విరాళం
'ఏపీ ఎన్జీజీవో' పై ప్రత్యేక అభిమానం... పరస్పర సహకారంతో పనిచేద్దాం : ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రికి ఏపిజేఏసి అమరావతి నూతన సంవత్సర శుభాకాంక్షలు 
స్త్రీశక్తి పథకం అమలులో గుర్తింపు కార్డు నిబంధనలు తొలగించాలి : సీఎంకు ఇయు నాయకుల వినతి