మిలిటరీ క్యాంప్‌లో కాల్పులు.. ఆర్మీ ఆఫీసర్ మృతి
On
జమ్ము కశ్మీర్‌లోని మిలిటరీ క్యాంప్ లో జరిగిన కాల్పుల ఘటనలో ఓ ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సాంబా జిల్లాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
బారి బ్రాహ్మణ క్యాంప్ లో మంగళవారం రాత్రి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటనలో ఏదైగా ఉగ్రకోణం ఉందా అనేది తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కాల్పుల ఘటన తర్వాత అదే క్యాంప్‌లోని ఓ జవాన్ కొన్ని ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పారిపోయినట్లు సమాచారం. అతని కోసం గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది.
Tags:
About The Author
Related Posts
Latest News
05 Jan 2026 20:46:00
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గొలిమి రామకృష్ణ నాయకత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఉద్యోగుల...

