20 ఏళ్ల తర్వాత కలిసిన థాక్రే సోదరులు.. ముంబై స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ
On
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విభేదాలతో విడిపోయిన థాక్రే సోదరులు ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే మళ్లీ కలిశారు.ముంబై స్థానిక ఎన్నికల్లోకూటమిగా ఏర్పడి పోటీ చేస్తామని ప్రకటించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నదమ్ములిద్దరూ కీలక ప్రకటన చేశారు. జనవరి 15న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో శివసేన (ఠాక్రే వర్గం), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. ముంబైకి మరాఠీ మేయర్ రానున్నారని వెల్లడించారు .
కాగా, 2005లో విడిపోయిన వీరు దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకున్నారు. ఈ ఏడాది జులైలో ముంబైలో నిర్వహించిన ‘వాయిస్ ఆఫ్ మరాఠీ’ కార్యక్రమంలో తొలిసారి ఒకే వేదికపై కనిపించారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఇకపై ఇద్దరం కలిసే ఉంటామని సోదరులు అప్పుడు స్పష్టం చేశారు. ఇక అన్నదమ్ముల కలయికపై ఇరు పార్టీల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
05 Jan 2026 20:46:00
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గొలిమి రామకృష్ణ నాయకత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఉద్యోగుల...

