ముఖ్యమంత్రికి ఏపిజేఏసి అమరావతి నూతన సంవత్సర శుభాకాంక్షలు 

ముఖ్యమంత్రికి ఏపిజేఏసి అమరావతి నూతన సంవత్సర శుభాకాంక్షలు 


అమరావతి(జర్నలిస్ట్ ఫైల్): రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర కమిటీ నాయకులు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాలతో ఇటీవల జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ జీఓలు విడుదల చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా రెవిన్యూ, ఆర్టీసీ ఇయు, కోఆపరేటివ్, హెడ్ మాస్టర్స్, లేబర్ ఆఫీసర్లు, పీఆర్ ఇంజినీర్లు తదితర సంఘాల డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి చేతులమీదుగా ఆవిష్కరించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై అక్టోబర్ 18న మంత్రివర్గ ఉపసంఘ సభ్యులతో పాటు ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ జీఓలు జారీ చేయడాన్ని ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర కమిటీ ప్రశంసించింది. ఈ మేరకు రాష్ట్ర కమిటీ తరఫున చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణిపేర్రాజు, కోశాధికారి కె.సంగీతరావు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు, ముఖ్యంగా మృతిచెందిన మరియు రిటైర్డు ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, ఐఆర్ ప్రకటించి పీఆర్సీ కమిషన్ నియమించాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ ఉద్యోగులకు హామీల అమలు

అక్టోబర్ 18న జరిగిన సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులకు ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జీఓ నెం.129 విడుదల చేయడంతో సుమారు 7,600 మందికి నూతన సంవత్సరంలో పదోన్నతులు లభిస్తున్నాయని తెలిపారు. అలాగే విలీనానికి ముందున్న విధానాల ప్రకారం మెడికల్ అన్‌ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించేలా డిసెంబర్ 26న జీఓ నెం.58 జారీ కావడంతో అనారోగ్యంతో ఉన్న ఉద్యోగుల కుటుంబాలకు ఉపాధి లభించిందన్నారు.

ఇటీవల ఏపీ పిటిడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్‌కు ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యత్వం కల్పించినందుకు ఆర్టీసీ ఇయు రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్యలు కృతజ్ఞతలు తెలిపారు.

చైల్డ్ కేర్ లీవ్ హామీ అమలు – మహిళా ఉద్యోగుల ఆనందం

రాష్ట్రంలో ఉద్యోగుల్లో సుమారు 60 శాతం ఉన్న మహిళా ఉద్యోగుల కోసం సేవా కాలంలో రిటైర్ అయ్యేలోపు ఎప్పుడైనా 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ వినియోగించుకునేలా ఇచ్చిన హామీని అమలు చేస్తూ డిసెంబర్ 16న జీఓ నెం.70 జారీ చేసినందుకు ఏపిజేఏసి అమరావతి మహిళా విభాగం కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా మహిళా విభాగం నాయకులు కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగుల అమ్మతనాన్ని గౌరవించిన గుర్తుగా ‘తల్లి–బిడ్డల’ మెమొంటోను అందజేశారు.

యూనియన్ కార్యాలయాలకు పన్నుల రద్దుపై హామీ

దశాబ్దాల క్రితం ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో నిర్మించిన ఉద్యోగ సంఘాల కార్యాలయాలకు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని హామీ ఇవ్వడంతో లక్షలాది మంది ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమైందని ఏపిజేఏసి అమరావతి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా 16 ఉద్యోగ సంఘాల తరఫున ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డాక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి.జయధీర్, ఏపీ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకట రాజేష్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.మల్లేశ్వరరావు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంసాని శ్రీనివాసరావు, మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.నాగేశ్వరరావు, పోలీసు అధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనుకుల శ్రీనివాసరావు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల కీశోర్ కుమార్, కోఆపరేటివ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సురేష్ నాయుడు, వీఆర్వో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆంజనేయకుమార్ (చంటి), ప్రధాన కార్యదర్శి జి.అనుపమ, రిటైర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోవకుమార్, హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్.రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బాలామృతం...రూ.1,200 కోట్ల టెండర్ల నిబంధనల్లో గోల్‌మాల్ ఆరోపణలు బాలామృతం...రూ.1,200 కోట్ల టెండర్ల నిబంధనల్లో గోల్‌మాల్ ఆరోపణలు
13.8 లక్షల చిన్నారుల భవిష్యత్తుతో చెలగాటం అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : రాష్ట్రంలోని ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లల పోషకాహార లోపాలను నివారించేందుకు 13.80...
ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్‌కు ఏపీ ఎన్జీజీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల విరాళం
'ఏపీ ఎన్జీజీవో' పై ప్రత్యేక అభిమానం... పరస్పర సహకారంతో పనిచేద్దాం : ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రికి ఏపిజేఏసి అమరావతి నూతన సంవత్సర శుభాకాంక్షలు 
స్త్రీశక్తి పథకం అమలులో గుర్తింపు కార్డు నిబంధనలు తొలగించాలి : సీఎంకు ఇయు నాయకుల వినతి
నేడు ... బీసీ, ఓసీ, మైనార్టీ ఉద్యోగుల సుధీర్ఘ పోరాటం ఫలించే రోజు !
ఏపీ ఎస్ఆర్ఎంలో వేడుకగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం